Gen Z Employees:ఈ జనరేషన్ వారంతా జాబ్లో చేరిన మొదటి రోజే జాబ్ మానేస్తున్నారు.. కారణం ఏంటంటే..

ఇటీవల కాలంలో జనరేషన్స్ అవేనండి తరాల గురించి సోషల్ మీడియాలో బాగా డిస్కస్ జరుగుతోంది. ఇప్పటివరకు మనం బేబీ బూమర్స్, Gen X, మిలిని యల్స్(GenY), ఆల్ఫా జనరేషన్ల(GenZ) జనరేషన్లను చూశాం.. ఇక 2025 తర్వాత పుట్టిన వారిని బీటా జనరేషన్ గా పరిగణిస్తున్నారు. అయితే గత జనరేషన్లలో జన్మిం చిన వారి పనితీరుపై ఇటీవల చర్చకు వచ్చింది. 

అదేంటంటే..ఈ నాలుగు జనరేషన్లలో పుట్టిన వారి మధ్య పనితీరును పరిశీలించనప్పుడు వ్యత్యాసం కనబడుతోంది. జాబ్స్ విషయంలో మిగతా జనరేషన్ వారితో పోల్చితే Gen Z జనరేషన్ అంటే మిలినియల్స్ చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారట. ఈ జనరేషన్ వారంతా జాబ్ లో అపాయింట్ అయిన  మొదటి రోజే మానేస్తున్నారట. 

కంపెనీలు నిర్వహించే లాంగ్ ఇంటర్వ్యూలు, కంపెనీల లేట్ ప్రాసెస్, నియమకాల్లో ఆలస్యం కారణంగా చాలా మంది అపాయింట్ మెంట్ తీసుకున్న తొలిరోజే జాబ్ మానేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. దీన్నే కెరీర్ క్యాట్ ఫిషింగ్ అని పిలుస్తున్నారు.జాబ్ ఆఫర్ ను అంగీకరించిన మొదటి రోజే  నోటీసులు లేకుండా కనిపించ కుండా పోతున్నారట.

Also Read :- ఇండియాలో పెరిగిపోతున్న HMPV వైరస్ కేసులు

ఇటీవల జరిగిన సర్వే రిపోర్టుల ప్రకారం.. 34 శాతం వమంది Gen Z జనరేషన్ ఉద్యోగులు.. కేరీర్ పై ఎక్కువ దృష్టి, విహార యాత్రల వంటి వ్యక్తి గత ప్రాధాన్యతలతో  కాఫీ బ్యాడ్జింగ్, కామ్ వంటి  వ్యూహాలను అవలంబిస్తున్నారట. 

వెయ్యి మంది యూకే ఎంప్లాయీస్పై జరిపిన సర్వేలో యువతరం అంతా తమ కేరీర్ విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తేలింది. ఈ ట్రెండ్ లో 24 శాతం మంది మిలీనియల్స్ (Gen Z )మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత 15 శాతంGen X, బేబీ బూమర్లు 10 శాతం మంది ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.

2025లో ఆ తర్వాత మిలీనియల్స్ (GenZ)  స్థిరమైన, ఫుల్ టైం జాబ్ పొందడం సవాల్ గా మారుతుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేరీర్ క్యాట్ ఫిషఇంగ్ త్వరిత గతిన వారికి పరిష్కారాన్ని అందించనప్పటికీ భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.