Gold Rates: మంటెత్తిస్తున్న గోల్డ్ రేట్స్.. ఈ పండుగ సీజన్లో బంగారం ఇంకేం కొంటారు..!

Gold Rates: మంటెత్తిస్తున్న గోల్డ్ రేట్స్.. ఈ పండుగ సీజన్లో బంగారం ఇంకేం కొంటారు..!

దసరా, దీపావళి పండగల సీజన్లో బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.78,700కు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధర భారీగానే పలుకుతుంది. మంగళవారం (అక్టోబర్ 8, 2024) నాడు హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,450గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,000 ఉండటం గమనార్హం.

గోల్డ్ రేట్ స్పీడ్ చూస్తుంటే 2024 ముగిసే నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.80 వేల గరిష్ట స్థాయికి చేరుకునేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. పండగలు, శుభకార్యాలు వస్తున్నాయంటే మహిళలు బంగారం షాపుల వద్ద క్యూ కట్టేస్తారు. అయితే.. కొద్ది రోజులుగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ధరలు తగ్గినా స్వల్పంగా తగ్గుతున్నాయే తప్ప భారీగా తగ్గిన దాఖలాలు ఇటీవల లేవు. మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారానికి ప్రస్తుతం డిమాండ్ కూడా పెరిగింది. 

ALSO READ | హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్..లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దసరా సందర్భంగా బంగారం కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపడం, నవంబర్లో పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో పసిడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎకనమిక్​ స్లోడౌన్, ఇన్​ఫ్లేషన్ ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్​ ఎక్కువగా ఉంటుంది. బంగారానికి గిరాకీ కొనసాగవచ్చని బులియన్​మార్కెట్ నిపుణులు అంటున్నారు. యూఎస్​ఫెడ్ నిర్ణయాలు బంగారం ధరలను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సాధారణంగా రెసిషన్​ సమయాల్లో పసిడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏడుసార్లు రెసిషన్​ రాగా, ఐదు సార్లు బంగారంలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్​ఫ్లేషన్​ పెరిగినా బంగారానికి డిమాండ్​ పెరుగుతుంది. స్టాక్స్, బాండ్లు, కరెన్సీల్లో రాబడులు తగ్గినా విలువ పెరుగుతుంది. వీటన్నింటినీ బట్టి చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు.