మాకు పథకాలు రాలే ఎందుకొచ్చినవ్​?.. కొప్పుల ఈశ్వర్​కు నిరసన సెగ

  • జగిత్యాల జిల్లా ఎండపల్లిలో అడ్డుకున్న గ్రామస్తులు

ధర్మపురి, వెలుగు :  జగిత్యాల జిల్లా ఎండపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్​కాన్వాయ్​ని గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. చివరి రోజు ఎన్నికల ప్రచారానికి కొప్పుల ఈశ్వర్​రాగా, విషయం తెలుసుకున్న గ్రామంలోని వివిధ కులాలకు చెందిన వారు ‘మా గ్రామం ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదు. అలాంటప్పుడు ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చారు’ అని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్హులకు దళిత బంధు, నిరుద్యోగ భృతి, గృహ లక్ష్మి పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు మినిస్టర్ కాన్వాయ్​ను పంపించారు.