ఏడుపెందుకు సబితమ్మా?.. ఎక్స్​లో తెలంగాణ కాంగ్రెస్ ప్రశ్న

ఏడుపెందుకు సబితమ్మా?..  ఎక్స్​లో తెలంగాణ కాంగ్రెస్ ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లమ్మా  అని కాంగ్రెస్ ఆదరించినందుకా అని  తెలంగాణ కాంగ్రెస్ ప్రశ్నించింది. బుధవారం ఈ మేరకు ఎక్స్ లో ప్రశ్నించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిని  చేసినందుకా అని ఫైర్ అయింది. కష్టకాలంలో కాంగ్రెస్ ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్ లో చేరినందుకా, బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉంటూ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పని చేసినందుకా, నువ్వు ఏడిస్తే సానుభూతి రాదు సబితమ్మా అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ లో పోస్టు పెట్టింది.