- హౌస్ ఓనర్స్ అసోసియేషన్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఇదే కోర్టులో పరిష్కారమైన కేసుపై మరోసారి పిటిషన్ వేసి కోర్టు టైం వేస్ట్ చేశారంటూ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నామ్పూర్కు చెందిన వివేకానందనగర్ ప్లాట్స్ అండ్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్‌కు హైకోర్టు రూ.25 వేలు ఫైన్ వేసింది. రెండు వారాల్లోగా పెనాల్టీ మొత్తాన్ని చెల్లించాలని జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు. వివేకానందనగర్ ప్లాట్ 47, 47/ఎ, 95ల్లోని 847 స్క్వేర్ యార్డ్స్ లో.. గోల్డ్ స్టోన్ ఇన్‌ఫ్రా కంపెనీ పర్మిషన్లు పొంది సెల్లార్ తో సహా ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టింది. ఇది పార్కు, ప్రజావసరాల కోసం నిర్దేశించిన జాగాలో కట్టారంటూ అసోసియేషన్ సెక్రటరీ సుధాకర్‌రెడ్డి హైకోర్టులో రిట్ వేశారు. అన్ని పర్మిషన్లు పొందాకే బిల్డింగ్ కట్టామని, బిల్డర్ నుంచి డబ్బులు వసూలు చేసేందుకే రిట్ వేశారని గోల్డ్ స్టోన్ తరఫు లాయర్ వాదించారు. దీనిపై కింది కోర్టు, ఇదే హైకోర్టులో కేసులు పరిష్కారమయ్యాయని, ఆ విషయాలన్నీ దాచి రిట్ వేశారని లాయర్ కోర్టుకు తెలిపారు.
For More News..
పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్