ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023 సమరం మరో 15 రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననుండగా.. ఇప్పటివరకు మూడుదేశాల క్రికెట్ బోర్డులు మాత్రమే వారి వారి జట్లను ప్రకటించాయి. ఇంకా భారత్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ జట్లను ప్రకటించాల్సి ఉంది. అయితే 15రోజుల సమయం మాత్రమే ఉండడంతో భారత జట్టు ఎంపిక ఎందుకు ఖరారు కాలేదన్నది అభిమానులను వేధిస్తోన్న ప్రశ్న.
రాహుల్, అయ్యర్‌ల ద్వయం
భారత జట్టు ఎంపికపై సెలెక్టర్లు మౌనం పాటించడానికి బలమైన కారణాలు ఉన్నట్లే తెలుస్తోంది. గాయాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్‌పై సెలెక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కాంటినెంటల్ టోర్నమెంట్‌లో ఆడుతున్నారు. ఈ ప్రక్రియ మరో రెండు ప్రాక్టీస్ గేమ్‌లతో ముగియనుంది. ఈ మ్యాచ్‌లలో వీరిద్దరూ ఎలా రాణించారు..? ఫిట్‌నెస్ ఎలా ఉంది..? అన్న విషయాల ఆధారంగా సెలెక్టర్లు ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అందుకు మరో నాలుగైదు రోజుల సమయం పట్టనుందని సమాచారం.
KL Rahul and Shreyas Iyer in the practice match.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2023
Rishabh Pant watching them! pic.twitter.com/aDWVc52zOm
అందునా ఈ ఏడాది ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మరి 50 ఓవర్ల పాటు వీరు వికెట్లు కాపాడుకోగలరా అనే దానిపై కూడా సెలెక్టర్లు దృష్టి పెట్టనున్నారు. అలా కాదని పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండానే ఎంపిక చేస్తే.. మరోసారి గాయపడితే వరల్డ్ కప్ 2023 నాటికి అందుబాటులోకి రాకపోవచ్చన్నది అన్నది జట్టు ఎంపిక ఆలస్యానికి మరో కారణం.
జట్టు ఎంపిక ఎప్పుడు?
అన్నీ సజావుగా జరిగితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల ప్యానెల్ ఈ వారంలోనే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయ్యర్, రాహుల్ ఇద్దరూ ఫిట్‌గా భావిస్తే మాత్రమే జట్టులో ఉంటారు. లేనియెడల ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా కొనసాగనుండగా.. సంజూ శాంసన్‌ను నాలుగో స్థానానికి ఎంపిక చేయవచ్చు.
అసియా కప్ 2023 సమరానికి దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటికే జట్టును ప్రకటించగా.. బంగ్లాదేశ్, నేపాల్ క్రికెట్ బోర్డులు వారి వారి జట్లను ప్రకటించాయి. భారత్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ జట్లను ప్రకటించాల్సి ఉంది.
పాకిస్థాన్ జట్టు
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, తైబ్ తాహిర్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్ (వైస్-కెప్టెన్), మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది.
నేపాల్ జట్టు
రోహిత్ పాడెల్ (కెప్టెన్), కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), భీమ్ షార్కీ, కుశాల్ మల్లా, ఆరిఫ్ షేక్, దీపేంద్ర సింగ్ ఎయిరే, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కేసీ, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి, ప్రతిష్ జీసీ ధకల్, సందీప్ జోరా, కిశోర్ మహ్తో, అర్జున్ సౌద్.
బంగ్లాదేశ్ జట్టు
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తంజీద్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహీద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, షేక్ మహెదీ, నసుమ్ హొఫ్సా, షమీ అహ్మదీన్, షోర్ఫుల్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్, మహ్మద్ నయీమ్.