
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్..సంచలన నిర్ణయాలు తీసుకున్నారు..తీసుకుంటూనే ఉన్నారు. ఉద్యోగుల కోత, వలసదారుల బహిష్కరణ,ట్యాక్సులు ఇలా అనేక నిర్ణయాలతో అటు అమెరికా, ఇటు ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తున్నారు.తాజాగా 43 దేశాలపై ట్రావెల్ ఆంక్షలు విధించేందుకు సిద్దమయ్యారు.
మొత్తం ప్రపంచ దేశాలను మూడు గ్రూపులుగా విభజించిన ట్రంప్..వాటిపై పూర్తిస్థాయి నిషేధం లేదా ప్రయాణాలు పరిమితం చేస్తూ లిస్టును తయారు చేశారు. ప్రస్తుతం ట్రంప్ పాలనా భద్రతాఅధికారులు, దౌత్య అధికారులుఈ ప్రతిపాదనను సమీక్షిస్తున్నారు. అయితే ఇండియా , చైనా సరిహద్దు దేశమైన అందమైన భూటాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ నిషేధిత లిస్టులో ఉంది.. ప్రపంచంలో అత్యంత అనందకరమైన దేశాల్లో ఒకటైన భూటాన్ పై అమెరికా ఎందుకు నిషేధం ఎందుకు?
ట్రావెల్ బ్యాన్ దేశాలను మూడు వర్గాలుగా విభజించినట్లు తెలుస్తోంది. రెడ్ లిస్ట్లో11 దేశాలు, ఆరెంజ్ లిస్టులో 10 దేశాలు, ఎల్లో లిస్ట్ లో 22 దేశాలు ఉన్నాయి. రెడ్ లిస్టులో ఉన్న 11 దేశాల ప్రజలకు అమెరికాలో ప్రవేశానికి పూర్తిగా నిషేధించారు. ఆరెంజ్ లిస్టు దేశాలకు ప్రయాణంలో లిమిట్స్ ఉంటాయి. ఇక ఎల్లో దేశాల ప్రజలకు భద్రతాపరమైన చెకింగ్స్ కోసం 60 రోజుల సమయం తీసుకుంటారు.
ALSO READ | ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. గాజాలో శవాల కుప్పలు.. 200 మందికి పైగా మృతి
రెడ్ లిస్టులో రష్యా, పాకిస్తాన్ వంటి దేశాలతోపాటు భూటాన్ కూడా ఉంది. ఉగ్రదాడులు, జాతి భద్రతకు ముప్పు, విద్వేష పూరిత భావజాలాన్ని ప్రోత్సహించే వలస చట్టాలను ఉపయోగించుకునే ఇతర దేశాలకు చెందిన వారినుంచి అమెరికా ప్రజలను రక్షించేందుకు లక్ష్యమని ట్రంప్ చెబుతున్నారు.
భూటాన్ పై ఎందుకు నిషేధం?
ప్రపంచంలో సంతోషకరమైన దేశాల్లో భూటాన్ ఒకటి. ఈ దేశం అమెరికా రెడ్ లిస్టులో ఉంది. అంటే ఇక్కడి ప్రజలు అమెరికాకు వెళ్లడం నిషేధం. భద్రత, వలస విధానాల కారణంగా భూటాన్ ను అమెరికా ప్రభుత్వం రెడ్ లిస్టులో ఉంచేందుకు కారణాలుగా చెప్పే అవకాశం ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) రిపోర్టుల ప్రకారం.. గతేడాది వీసా ఉల్లంఘనల్లో భూటాన్ 37శాతం పెరుగుదలను చూసింది.
2019 DHS నివేదిక ప్రకారం..10% పరిమితిని మించి ఓవర్‌స్టే రేట్లు ఉన్న దేశాలలో భూటాన్ ఒకటి.ఆ తర్వాత చాడ్ (44.94%), జిబౌటి (37.91%), మౌరిటానియా (30.49%), ఇరాన్ (21.64%), ఆఫ్ఘనిస్తాన్ (11.99%) వంటి దేశాలు ఉన్నాయి.
నిషేధం అమలు అయితే అమెరికా వెళ్లేందుకు, అక్కడ చదువుకునేందుకు, పనిచేసేందుకు భూటాన్ పౌరులకు ఇబ్బందులు తప్పవు. వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు,ఉద్యోగ అవకాశాలను కోరుకునే నిపుణులు ఎక్కువగా ప్రభావితమవుతారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్నవారికి తిప్పలు తప్పవు. అమెరికాలో ఉన్న భూటాన్ పౌరులు అదనపు తనిఖీలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వీసా పునరుద్దరణ కష్టంగా మారవచ్చు.