పదేండ్లలో పేపర్​ లీకులపై కవిత ఎందుకు మాట్లాడలే? : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

పదేండ్లలో పేపర్​ లీకులపై కవిత ఎందుకు మాట్లాడలే? : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
  • మాస్ కాపీయింగ్ ఆరోపణలు అవాస్తవం: బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ పరీక్షల్లో కోఠి ఉమెన్స్ కాలేజీలో మాస్ కాపీయింగ్ జరిగిందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించడం కరెక్ట్​కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు కేసీఆర్ ఒక్కడే వ్యతిరేకి అనుకున్నానని.. కానీ, సాటి మహిళలకు కవిత కూడా వ్యతిరేకి అని ఇప్పుడు తెలిసిందన్నారు. పదేండ్ల బీఆర్​ఎస్​పాలనలో అన్ని పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయితే కవిత ఒక్కమాట కూడా మాట్లాడలేదని.. ఆ సమయంలో ఆమె లిక్కర్ దందాలో బిజీగా ఉందని ఎద్దేవా చేశారు.

లిక్కర్ కేసులో ఇప్పటికే కవిత పరువు పోయిందని, ఇప్పుడు అబద్ధాలు మాట్లాడి ఉన్న పరువు కూడా తీసుకోవద్దని సూచించారు. రాష్ట్ర యువతను కవిత తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. అన్న కేటీఆర్ నాలుగు అబద్ధాలు ఆడితే.. తాను ఇంకో రెండు ఎక్కువ అబద్ధాలు ఆడుతాను అన్నట్లుగా కవిత పరిస్థితి ఉందన్నారు. కేటీఆర్, కవిత మధ్య పోటీలో నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దన్నారు. అంగట్లో అమ్ముకున్నట్టు పరీక్ష పేపర్లను అమ్ముకున్న చరిత్ర మీదని కవితపై వెంకట్ మండిపడ్డారు.