ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కి రష్యా విప్లవానికి సంబంధం ఏంటి?

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఫస్ట్ టైం 1911 సంవత్సరంలో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. 1908లో అమెరికాలోని న్యూయార్క్ సిటీకి చెందిన 15వేల మంది మహిళలు తమకు పని గంటలను తగ్గించాలని, ఓటు వేసే హక్కును కల్పించాలని పెద్ద ఎత్తున నిరసన చేశారు. పురుషులతోపాటు సమానంగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. వారి డిమాండ్స్ సాధించుకున్నారు. దీంతో 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా నేషనల్ ఉమెన్స్ డే జరుపుకోవాలని ప్రకటించింది.

అమెరికాలో నేషనల్ ఉమెన్స్ డే

తర్వాత క్లారా జెట్కిన్ అనే మహిళ మహిళా దినోత్సవాన్ని  ప్రపంచవ్యాప్తంగా ఆచరణలోకి తీసుకురావాలని వాదించింది. ఈ క్రమంలో 1910లో కోపెన్ హాగెన్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ కార్యక్రమంలో జర్మన్‌ దేశస్థురాలైన క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవశ్యకత గురించి చెప్పింది. ఆ సదస్సులో 17 దేశాల నుంచి 100 మంది మహిళలు ఉమెన్స్ డే జరుపుకోవడానికి అంగీకరించారు. దీంతో ఫస్ట్ టైం  1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా  ఏదో ఒక రోజు నిర్వహించేవారు. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదలైంది. ఐక్యరాజ్యసమితి 1975వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టింది. 

రష్యా విప్లవం 1917

మొదటిప్రపంచ యుద్దం కారణంగా రష్యాలో జరిగిన నష్టాన్ని మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. తినడానికి తిండిలేక, భయంతో బతుకుతున్న వారు రష్యా చక్రవర్తి నికోలస్ విధానాలు ఖండిస్తూ 1917లో నిరసనకు దిగారు. ఆ దేశంలో స్త్రీల తిరుగుబాటుతో చక్రవర్తి పాలన అంతమై తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అదే సంవత్సరం రష్యాలో  స్త్రీలకు ఓటు హక్కు కూడా కల్పించారు. చక్రవర్తిని ఎదిరిస్తూ స్త్రీలు విప్లవం చేసింది మార్చి 8రోజే.. అందుకే, ఆరోజు జ్ఞాపకార్థంగా ప్రపంచం మహిళా దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించుకున్నారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ఉమెన్స్ డే జరుపుకుంటారు. ఈసారి మార్చి 8 థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్: అసెలిరేట్ ప్రోగ్రెస్.

ALSO READ :-న్యూయార్క్​ లో ఘనంగా శివరాత్రి సంబరాలు...  హర హర మహాదేవ పాటకు స్టెప్పులేసిన భక్తులు