Shruti Haasan: రెండు సినిమాల నుంచి శృతిహాసన్ ఔట్.. తప్పుకుందా.. తప్పించారా?

Shruti Haasan: రెండు సినిమాల నుంచి శృతిహాసన్ ఔట్.. తప్పుకుందా.. తప్పించారా?

స్టార్ హీరోయిన్  శృతిహాసన్ (Shruti Haasan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ హాసన్ కుమార్తెగా మూవీ ఇండస్టీలోకి వచ్చినా... తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఇటీవలే ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీలో నటించి మెప్పించింది. తర్వాత మళ్లీ ఈమె సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. అయితే తాజాగా శృతిహాసన్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

అడవిశేష్ హీరోగా డెకాయిట్ మూవీ రూపొందుతోంది. అందులో హీరోయిన్గా ఫస్ట్ శృతిహాసన్ను ఎంపిక చేసినా.. తర్వాత ఆమె ఆ మూవీ నుంచి తప్పుకుంది. దీంతో మేకర్స్ ఈ మూవీకి మృణాల్ ఠాకూర్ను ఎంపికచేశారు. ఈ మూవీనే కాదు మరో రెండు సినిమాల నుంచి కూడా శృతి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాల నుంచి ఆమె తప్పుకుందా ? లేదా మేకర్స్ తప్పించారా? అనేది ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

శృతిహాసన్తో పనిచేయడం కష్టమని ఆమెతో సినిమాలు చేసిన మేకర్స్ చెప్తున్నారట. ఇందుకు ఆమె ఆటిట్యూడ్ కారణమని అంటున్నారట. ఏదేమైనా ఆమె సినిమాల నుంచి బయటకు వచ్చేస్తుందని సినీ వర్గాల్లో టాక్ ఉంది.

ప్రస్తుతం శృతి హాసన్.. రజినీకాంత్ కూలీ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో రజినీకాంత్, శృతి మధ్య సాగే సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sun Pictures (@sunpictures)