టెస్ట్ సిరీస్ జోరును టీమిండియా వన్డేల్లోనూ కంటిన్యూ చేసింది. వెస్టిండీస్‌తో 2023 జూలై 27 గురువారం రోజున బార్బడోస్‌లో జరిగిన తొలి వన్డేలో ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సూర్యకుమార్ యాదవ్.. సంజూ శాంసన్ జెర్సీని ధరించి గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. అయితే దీనిపై టీమిండియా క్రికెట్ మేనేజ్మెంట్ స్పందించింది.
సూర్యకు ఇచ్చిన జెర్సీ సైజులో మార్పు జరిగిందని, లార్జ్ సైజ్ టీషర్ట్ రావడం ఆలస్యం కావడంతో సూర్య ... సంజూ జెర్సీని ధరించి గ్రౌండ్ లోకి వచ్చాడని వెల్లడించాయి. సూర్యకుమార్ యాదవ్ ఇతర ఆటగాళ్ల జెర్సీని ధరించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత బ్యాటర్ అర్ష్‌దీప్ సింగ్ జెర్సీని ధరించి కనిపించాడు.
AsloRead:పరిశ్రమల స్థాపనకు భారత్ అనుకూలం: ప్రధాని మోదీ
ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 రన్స్‌కే కుప్పకూలింది. షై హోప్ (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) టాప్ స్కోరర్. తర్వాత ఇండియా 22.5 ఓవర్లలో 118/5 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (46 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీ చేశాడు. కుల్దీప్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది.