ఎందుకు ఇలా..? : 30 రోజుల్లో.. 79 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

ఎందుకు ఇలా..? : 30 రోజుల్లో.. 79 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

భారత్‌లో అమలులోకి వచ్చిన కొత్త ఐటీ చట్టం 2021 వల్ల ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ రూల్స్ స్ట్రిక్ట్ చేస్తోంది. ఒక్క మార్చి నెలలోనే  రూల్స్ ఫాలో అవ్వని 79లక్షల ఇండియన్ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని మెటా సంస్థ నెలవారీ రిపోర్ట్ లో పేర్కొంది. ఇండియాలో మొత్తం 500 మిలియన్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయిని కంపెనీ తెలిపింది.

 మార్చిలో ఎక్కువగా12వేల782 కంప్లెయింట్లు వచ్చాయని ఆయా కంప్లెయింట్లు వచ్చిన నెంబర్స్ పై యాక్షన్ తీసుకొని అకౌంట్ బ్యాన్ చేశామని వాట్సాప్ వివరించింది. మార్చిలో 79లక్షల 54 వేల అకౌంట్లు.. అలాగే ఫిబ్రవరిలో 76లక్షల వాట్సాప్ అకౌంట్లు నిషేదించినట్లు కంపెనీ తెలిపింది. వాటిల్లో 1కోటి 42లక్షల 4 వేల అకౌంట్లు ఎలాంటి కంప్లెయింట్స్ రాకముందు వాట్సాప్ రూల్స్ బ్రేక్ చేశారట. సెక్యూరిటీ ఫీచర్లు కంట్రోలింగ్ తోపాటు యూజర్ల అందరూ ఇండియన్ ఐటీ రూల్స్ ఫాలో చేసేవిధంగా ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, అనలైటిక్స్, రిసెర్చర్స్, ఆన్ లైన్ సెక్యూరిటీ టెక్నిషియన్లు నియమిస్తామని వాట్సా్ప్ ప్రకటించింది.