కంట్రోల్ టవర్ ఏం చేస్తుంది..? విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

కంట్రోల్ టవర్ ఏం చేస్తుంది..? విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా జరగకుండా నిరోధించాల్సిందని ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. గాలిలో విమానం ఉందని హెలికాఫ్టర్ను అలర్ట్ చేయడంతో పాటు ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో హెలికాఫ్టర్ పైలట్కు కంట్రోల్ టవర్ ఎందుకు చెప్పలేదని ఏవియేషన్ అథారిటీని ట్రంప్ ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని, ప్రమాదం జరగకుండా నిరోధించే అవకాశం ఉన్నప్పటికీ నిరోధించలేకపోవడం ఏమాత్రం బాలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానం గాల్లో మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో విమానం, హెలికాప్టర్ పక్కనే విమానాశ్రయం పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

Also Read :- అదే చోట.. అవే టెంట్లు రెండోసారి తగలబడ్డాయి

PSA ఎయిర్ లైన్స్కు చెందిన 5342 విమానం విచిత కన్సాస్ (ICT) నుంచి వాషింగ్టన్ రీగన్ జాతీయ ఎయిర్ పోర్ట్ ((DCA) కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యూఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ను విమానం ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విమానం, హెలికాఫ్టర్ ఢీ కొట్టగానే గాల్లోనే పేలిపోయింది. అమెరికాలో 2009 తర్వాత ప్రయాణికులతో వెళుతున్న విమానాలు ప్రమాదానికి గురైన దుర్ఘటనలు జరగలేదని, మళ్లీ ఇప్పుడే ఈ ఘోరం జరిగిందని తెలిసింది.