కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతోనే ఎందుకు దీపారాధన చేయాలి.. 

కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతోనే ఎందుకు దీపారాధన చేయాలి.. 

కార్తీకపౌర్ణమి  ఈ ఏడాది ( 2024) నవంబర్​ 15 శుక్రవారం వచ్చింది. ఈ రోజు ఆవునెయ్యితో  గాని.. నువ్వులనూనెతో గాని 365 వత్తులతో దీపారాధన చేప్తారు.  ఇన్ని ఒత్తులతో ఎందుకు దీపారాధన చేయాలి..  ఏ సమయంలో వెలిగించాలి.. కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏమిటి..  ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

కార్తీకమాసం కొనసాగుతుంది.  ఇప్పటికే రెండు సోమవారాలు.. ఏకాదశి లాంటి ముఖ్యమైన దినాలు ముగిసాయి.  ఇప్పుడు మరో విశిష్టత కలిగిన రోజు కార్తీక పౌర్ణమి ( నవంబర్​ 15) కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆరోజు ఉసిరి దీపాలు వెలిగించడానికి.... 365 వత్తులు వెలిగించడానికి  ఇటు భక్తులు.. అటు దేవాలయాలు ముస్తాబు అయ్యాయి.  ఆ రోజున  365 వత్తులతోదీపారాధన చేయాలని పురాణాలు చెబుతున్నాయి.  కార్తీక పౌర్ణమి రోజు ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.  ఆ దివ్య శక్తుల నుంచి పార్వతి ... పరమేశ్వరులు... లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుందని స్కంద పురాణంలో రుషి పుంగవులు పేర్కొన్నారు. అందుకే హిందువులు.. భక్తులు ఆరోజు కోసం ఎదురు చూస్తుంటారు. 

కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన చేయడానికి ఒక పరమార్థం ఉంది,  చాలామంది హిందువులు ప్రతిరోజు తమ గృహాల్లో దీపారాధన చేస్తారు,  కాని ఒక్కోసారి అనుకోని అడ్డంకులు రావడం.. ఊళ్లకు వెళ్లాల్సి రావడం వంటివి జరుగుతుంటాయి.  ఆ సమయంలో ఇంట్లో దీపం పెట్టేందుకు అవకాశం ఉండదు.  అందుకే పూర్వకాలంలో ఏదైనా ఊరు వెళితే ఇంటి పురోహితునికి తాళం ఇచ్చి వెళ్లేవారు.. ఆయన వచ్చి దీపారాధన చేసి వెళ్లేవారు.  కాని కలియుగంలో అలాంటి రోజులు కాదు కదా.. మరి.  

ప్రతిరోజు దీపం పెట్టే ఇంట్లో దీపం పెట్టకపోతే ఇంటి యజమానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది.  ప్రస్తుతం నడుస్తున్న యుగంలో  జనాలు బిజీ లైఫ్​.. ఈ జీవితంలో సరిగ్గా తినడానికే ఖాళీ ఉండదు.. ఇంకా దీపానికి ఎక్కడ సమయం ఉంటుంది.  పూజల వ్యవహారం పండగలకో.. పబ్బాలకో పరిమితమైంది.  ఆ సమయంలోనే దీపారాధన కూడా చేస్తుంటారు.  నిత్యం దీపం పెట్టకుండా ఉంటే దోషాలు ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.  కలియుగంలో అందరికి సాధ్యపడదు కావున త్రేతా యుగం కాలం నాటి నుంచి కార్తీక మాసం పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే ఏడాది కాలమంతా దీపారాధన చేసిన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.  

మరి కార్తీక పౌర్ణమి రోజే ఎందుకు

ప్రతి నెలా పౌర్ణమి వస్తుంది కదా.. మరి కార్తీక పౌర్ణమికే అంత ప్రత్యేకత ఎందుకంటే... ఆరోజు దేవతలు దీపావళి పండుగ ... దీపాల పండుగ జరుపుకుంటారు.   ఆరోజున పార్వతి .. పరమేశ్వరులు.. లక్ష్మీ నారాయణులు దీపాలను వెలిగిస్తూ భూమిపైకి వస్తారని పురాణాలు చెబుతున్నాయి.  అందుకే కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన చేసి వారిని ఆహ్వానించి.. పూజలు చేసి ఆశీస్సులు పొందుతారు.