Good Health : అర్థరాత్రులు ఎందుకు తినకూడదు.. తింటే ఏమౌతోంది..?

Good Health : అర్థరాత్రులు ఎందుకు తినకూడదు.. తింటే ఏమౌతోంది..?

కంప్యూటర్​ యుగంలో  జనాలు బిజీ బీజీగా గడుపుతున్నారు.  బెడ్​ పై నుంచి ఎప్పుడు లేస్తారో... ఎప్పుడు పడుకుంటారు.. ఎప్పుడు తింటారో కూడా అర్దం కాని పరిస్థితి..  చాలామంది అర్దరాత్రి  దాటిన తింటారు.. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి..  టైం కాని టైంలో అర్దరాత్రి ఆహారం తింటే ఏమౌతుందో తెలుసుకుందాం.. . . . 

  •  బరువు అమాంతం తగ్గిపోతే బాగుండు అనుకుంటారు కొందరు. తగ్గడం కంటే అసలు పెరగకుండా చూసుకుంటే మంచిది అంటారు డైటీషియన్లు. కానీ బరువు పెరిగితే డైట్, ఫిట్నెస్.. చాలా రకాల మార్గాలుంటాయి. 
  •  లైఫ్ స్టయిల్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే రోజూ దినచర్యలలో కొద్దిగా మార్పు చేసుకుంటే సరి. 
  •  భోజనం హడావిడిగా చేయడం వల్ల జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. అందుకే ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినాలి. దానివల్ల పొట్ట నిండినట్టుగా కాకుండా కొంత ఖాళీ ఉంటుంది. 
  •  రాత్రి భోజనం చేశాక ఏదో ఒక తీపి పదార్థం తినడం అలవాటు ఉంటుంది కొంత మందికి. అది మానేయాలి. మరికొంత మంది ఆకలి వేస్తే అర్థరాత్రి అని చూడకుండా ఫ్రిజ్లో ఏముంటే అవి తినేస్తుంటారు. అది అసలు మంచిది కాదు. ఒకవేళ ఎక్కువగా ఆకలి అనిపిస్తే నీళ్లు తాగడమో, నట్స్ లాంటివి. తినడమో చెయ్యాలి. 
  •  కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలు ఎక్కువ తింటే మంచిది. బ్రెడ్ కంటే కూడా తృణధాన్యాలతో చేసిన పదార్థాలు తింటే మంచిది. వర్కవుట్స్ చేశాక వీటిని తింటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. 
  •  కూల్​ డ్రింక్స్, టీ, కాఫీ, చక్కెర కలిపిన జ్యూస్​ లు తాగితే బరువు పెరుగుతారే కానీ ఎప్పటికీ తగ్గరు. 
  •  అన్నిటికంటే ముఖ్యం నిద్ర... సరిగా నిద్ర లేకపోతే శక్తి సన్నగిల్లుతుంది. ఫలితంగా ఆకలి పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల జీర్ణక్రియలో కూడా మార్పులొస్తాయి. కాబట్టి రోజుకు ఆరుగంటలు తప్పకుండా నిద్ర పోవాలి. అలాగే ఎనిమిది గంటలకు మించిన నిద్ర కూడా మంచిది కాదు..