Diwali Special 2023: హిందూపురాణాల ప్రకారం, దీపావళి ముగిసిన తర్వాత రోజు గోవర్ధన్ పూజ, గోమాతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షం పాడ్యమి రోజున ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఏడాది గోవర్దన పూజ కార్తీక శుద్ద పాడ్యమి నవంబర్14న వచ్చింది.
హిందూ పంచాంగం ప్రకారం, దీపావళి ముగిసిన తర్వాత గోవర్ధన్, గోమాతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పాడ్యమి రోజున ఈ వేడుకలను నిర్వహిస్తారు. . ఈ పవిత్రమైన రోజున గో సంరక్షకులకు ఆహారం, వస్త్రాలను దానంగా ఇస్తే శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. తమ ఇంట్లో నిత్యం సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. మన భారతదేశంలో మధురలో గోవర్ధన పర్వతాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ సందర్భంగా గోవర్ధన పూజా విధానం, శుభ ముహుర్తం, గోవర్ధన ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
- గోవర్ధన్ పూజ 2023 తేదీ: మంగళవారం, నవంబర్ 14, 2023
- ఉదయం పూజ ముహూర్తం: 06:43 AM నుండి 08:52 AM వరకు
- కార్తీక శుద్ద పాడ్యమి తిథి ప్రారంభం: నవంబర్ 13, 2023న మధ్యాహ్నం 02:56
- కార్తీక శుద్ద పాడ్యమి తిథి ముగింపు : నవంబర్ 14, 2023న మధ్యాహ్నం 02:36 గంటలకు
ప్రతి శ్రీకృష్ణుడి భక్తుడికి గోవర్ధన పండుగ ఎంతో ప్రత్యేకమైంది... పవిత్రమైంది. ఈ పండుగ కోసం శ్రీకృష్ణ భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఈ పండుగను ప్రతి ఏడాది దీపావళి మరుసటి రోజున ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
ఈ రోజున శ్రీకృష్ణుడిని, గోవర్ధన పర్వతాన్ని, గోమాతను పూజిస్తారు. గోవర్ధన పూజ శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ రోజు గోవర్ధన పర్వతాన్ని, శ్రీకృష్ణునికి ఇష్టమైన ఆవులను పూజిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
హిందూ పురాణాల ప్రకారం.. ఈ రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడి కోపం నుంచి బృందావన ప్రజలను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిలో ఎత్తుతాడు. అప్పటి నుంచి గోవర్ధన పర్వతాన్ని పూజించడంతో పాటుగా శ్రీకృష్ణుడిని ఈ రోజు పూజించడం ప్రారంభించారు. కాగా కన్నయ్యను గోవర్ధనదారి, గిరిధారి అని కూడా పిలుస్తారు.
గోవర్ధన పూజా విధి
- గోవర్ధన పూజ రోజు భక్తులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పుణ్యస్నానాలు చేయాలి.
- ఆ తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి.
- మీ ఇంటి గుడిలో దీపాన్ని వెలిగించాలి.
- ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని తయారుచేసి పూజించాలి.
- అలాగే నైవేద్యాలను తయారుచేసి గోవర్ధనదారికి సమర్పించాలి.
- మంత్రాలు పఠిస్తూ గోవర్ధన విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
- కన్నయ్యకు దండం పెట్టుకుని గోవర్ధన హారతితో పూజను ముగించాలి.
గోవర్ధన పూజలో భాగంగా వేణు మాధవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. క్రిష్ణుడితో పాటు ఇంద్రుడు, అగ్ని, చెట్టు, భూమితో పాటు ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడే దేవతలందరినీ పూజిస్తారు. కన్నయ్యకు వెన్నముద్దలు, పెరుగు, బియ్యం, తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. చివరగా హారతి ఇవ్వాలి.
పూజ పూర్తయిన తర్వాత, కుటుంబ సభ్యులు మరియు భక్తుల మధ్య ప్రసాదం (దీవించిన ఆహార పదార్థాలు) పంపిణీ చేయండి.
గోవులకు ఆహారం ఇవ్వడం: హిందూ మతంలో ఆవులను పవిత్రంగా పరిగణిస్తారు కాబట్టి, గోవర్ధన్ పూజలో గోవులకు ఆహారం ఇవ్వాలి.
పురాణ కథ
పురాణాల ప్రకారం, ఓ రోజు ఇంద్రుడు జడివాన కురిపిస్తాడు. ఆ సమయంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమయంలో ఇంద్రుని గర్వాన్ని అణిచివేసేందుకు శ్రీ క్రిష్ణుడు తన చిటికిన వేలితో పర్వతాన్ని ఎత్తి, అందరినీ అక్కడికి చేర్చి రక్షిస్తాడు. దీంతో గోకులంలో ఉండేవారంతా శ్రీక్రిష్ణుడిని, గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు. అదే సమయంలో ఇంద్రుని అహంకారం తగ్గిపోయింది. దీంతో శ్రీ క్రిష్ణుడిని క్షమించమని అడుగుతాడు.
ఆ సమయంలో శ్రీక్రిష్ణుడికి ఇంద్రునికి ఇలా చెప్తాడు. కార్తీక మాసంలో శుక్ల పక్షంలో 56 భోగాలను చేసి గోవర్ధన పర్వతాన్ని పూజించమని చెబుతాడు. అప్పటి నుంచి గోవర్ధన పర్వతం నుండి గోకుల నివాసంలో ఉండేవారంతా ఆహారం పొందుతారు. వ్యవసాయాన్ని మెరుగుపరుచుకుంటారు. అందుకే ఈ సమయంలో గోవర్ధన పూజను కచ్చితంగా చేస్తారు.