
పుట్టంగనే కేరమని ఏడుస్తం. అప్పుడు మొదలైన కన్నీళ్లు చివరి శ్వాస వరకు ప్రవహిస్తూనే ఉంటయ్. కష్టం వచ్చినప్పుడు చెంపలపై జారుతూ.. సంతోషం వచ్చినప్పుడు జలపాతంలా చెంగున దూకుతుంటయ్. ప్రతి కథలో కన్నీళ్లు ఉంటయ్! మరి కన్నీళ్లకు కూడా ఒక కథ ఉంటది!
మనిషి శరీరం ఏడాదికి నూటపది లీటర్ల వరకు కన్నీటిని ఉత్పత్తి చేస్తది. నమ్మబుద్ధి కావడం లేదు కదూ? ఏడాది మొత్తం ఏడ్చి ఏడ్చి డ్రమ్ నింపి దాన్ని కొలవక్కర్లేదు. నిజంగనే అన్ని లీటర్ల కన్నీళ్లు శరీరం ఉత్పత్తి చేస్తది. “సరే.. చేస్తాయే... అనుకో... మరి గవన్నీ ఎక్కడుంటయ్' అనేగా మీ సందేహం? కేవలం ఏడ్చినప్పుడే కన్నీళ్లు రావు! మనకు మూడు రకాల కన్నీళ్లు ఉన్నయ్. బేసల్ కన్నీళ్లు...
కళ్లు పని చెయ్యడానికి ఆధారమయ్యే కన్నీళ్లు బేసల్ కన్నీళ్లు.
ఇవి నిత్యం ఉత్పత్తి అయితనే ఉంటయ్. చక్రానికి ఉండే చరాలు తిరగడానికి ఆయిల్ ఎట్ల అవసరమో... కనుగుడ్డుకు కూడా. ఇవి లూబ్రికెంట్ అన్నమాట. దుమ్ము, దూళి పడితే స్వీపర్లాగా శుభ్రం చేసేది కూడా ఈ కన్నీళ్లే. అంతేకాదు కళ్లకు ఇన్ఫెక్షన్ రాకుండా. బయటి నుంచి దాడి చేసే బ్యాక్టీరియాతో యుద్ధం కూడా చేస్తాయ్ ఈ కన్నీళ్లు కనుగుడ్ల చుట్టూ ఈ నీళ్లు పారకుంటే ఎండిన పొలంలెక్కనే. కళ్లు పాలిపోయి మండుతుంటయ్!.
ఏడుపు ఎట్ల మొదలైతది?
కంటి రెప్పల కింద వెనుకభాగంలో కన్నీటి గ్రంథులుంటయ్, బాధ కలిగినప్పుడు నాడీ వ్యవస్థ క్రేనియల్ నరాన్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు మెదడు బాధ తాలుకా సంకేతాలను కన్నీటి గ్రంథులకు పంపుతది. అప్పుడు ఏడుపు స్టార్ట్ చేస్తం.. వెంటనే కళ్ల నుంచి కన్నీళ్లు కారుతయ్. నీళ్లు.. ద్రవాలు.. లైసోజోమ్, లిపోకాలిన్, సోడియం, గ్లూకోజ్లు ఉంటయ్. దీంతో పాటు ప్రొటీన్లు కూడా మస్తు ఉంటయ్.
రిఫ్లెక్స్ కన్నీళ్లు
చిరాకు తెప్పిస్తే కళ్లకు కూడా కోపమే వస్తది. కోపం వచ్చినప్పుడు చిరాకు తెప్పించిన వాటిని ముంచెయ్యడానికి వచ్చేవే రిఫ్లెక్స్ కన్నీళ్లు.
పరాయి అణువులు కంటిలోకి వచ్చినప్పుడు ఈ కన్నీళ్లు సర్జికల్ స్ట్రైక్స్ చెయ్యడానికి వెంటనే ఊరుతయ్. ఉల్లిగడ్డలు కోసినప్పుడు... టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు. పెప్పర్ స్ప్రే కొట్టిన ప్పుడు.. ఏదైనా సుగంధ ద్రవ్యాన్ని లేదా పరిను కాన్ని గాఢంగా పీల్చినప్పుడు ఈ కన్నీళ్లు తెలియ కుండానే జాలుపడ్తాయ్.
సూర్యుడు, బల్బు నుంచి వచ్చే కాంతిరేఖలు కళ్లలోకి దూసుకొచ్చినప్పుడు కూడా ఈ కన్నీళ్లే వచ్చేది. నాలుకకు వేడి పదార్థా లు తాకినప్పుడు, వాంతులు చేసుకున్నప్పుడు... దగ్గినప్పుడు.. ఆవలించినప్పుడు కూడా వచ్చేవి. కూడా ఈ రకమే. కళ్లను రక్షించడమే వీటి ప్రధాన బాధ్యత.
ఎమోషనల్ కన్నీళ్లు
వీటి గురించి అందరికీ తెలుసు! ఇవి పూర్తిగా భావోద్వేగాలకు సంబంధించిన కన్నీళ్లు. ప్రతి భావోద్వేగానికి ఇవి ప్రతిస్పందిస్తయ్ బాధతో ఏడ్చినప్పుడు. పట్టరాని కోపం వచ్చినప్పుడు. గాయాలైనప్పుడు, నొప్పిని భరించలేనప్పుడు ఈ కన్నీళ్లు వస్తయ్. ఈ కన్నీళ్లలో డిప్రెషన్ హా రోఫీన్లు ఉంటాయ్. ఏడ్చినప్పుడు ఇవి బయటకు పోతయ్. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడిస్తే మంచిదని అంటుంటారు. అయితే కేవలం ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ కలిగినప్పుడే కాకుండా... పట్టరాని సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఈ ఎమోషనల్ కన్నీళ్లు వస్తయ్.
== వెలుగు లైఫ్