చల్లని వాతావరణం, పచ్చదనం, తాజాదనంతో వానాకాలం అంటేనే ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంటుంది. అయితే పురుగులు ఎక్కువగా కనిపించేది ఈ సీజన్లోనే. అందుకు కారణం ఏంటో తెలుసా?. దీని వెనుక ఉన్న థియరీని పాపులర్ నేచురలిస్ట్ 'పూచీ' వెంకట్ వివరిస్తున్నాడు. "పురుగులు సాధారణంగా అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తుంటాయి. అప్పటిదాకా అవి సుప్తావస్థ (నిద్రాణవస్థ)లో ఉంటాయి.
ఈ స్థితిని డయాపౌజ్ అంటారు. వానలు మొదలయ్యాక ఆ స్థితి నుంచి అవి బయటకు వస్తాయి. తేమ అనుకూల వాతావరణం కావడంతో అవి స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. పైగా మొక్కలు, పువ్వులు ఎక్కువగా కనిపించేది ఈ సీజన్లోనే. అందుకే సీతాకోక చిలుకలు, తేనెటీగలు, రెక్కల చీమలు, మిగతా పురుగులు ఆహారం కోసం తిరుగుతుంటాయి. వాటిని వెతుక్కుంటూ పక్షులు, గబ్బిలాలు, బల్లులు.. ఇలా మిగతావి వేటాడుతాయి.
Also Read:-డ్రగ్స్ మత్తులో మొసళ్లు!! ..నీళ్లలోంచి దూసుకొస్తున్నయ్
యానిమల్ లైఫ్ సైకిల్ లో రెయిన్ సీజన్ ఒక బ్యూటీఫుల్ కనెక్షన్గా వర్ణిస్తున్నాడు. ఆయన. అంతేకాదు ప్రకృతిలో ఎలాంటి మార్పులు సంభవించినా సరే.. పురుగులు తమకు అనుకూలంగా మార్చుకోగలవని చెప్తున్నాడు. ఈ విషయంలో చీమలు చాలా తెలివిగా వ్యవహరిస్తాయట. 'తర్వాతి తరాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చీమలకు బాగా తెలుసు. అందుకే వాతావరణాన్ని ఒక అంచనా వేసుకుని మరీ గుడ్లు పొదుగుతాయి. ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి' అని వివరించాడు వెంకట్.