పరిమితికి మించి టికెట్లు ఎందుకు అమ్మారు: రైల్వే శాఖను ప్రశ్నించిన ఢిల్లీ కోర్టు

పరిమితికి మించి టికెట్లు ఎందుకు అమ్మారు: రైల్వే శాఖను ప్రశ్నించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌‌లో జరిగిన తొక్కిసలాట లో 18 మంది మరణించిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్రం, రైల్వేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కోచ్‌‌లో కూర్చోబెట్టగల ప్రయాణికుల సంఖ్య కంటే ఎక్కువ టిక్కెట్లు ఎందుకు అమ్మారో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు గేదెలాతో కూడిన బెంచ్ ఆదేశించింది. 

ఇటువంటి సంఘటనల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దాఖలైన పిల్‌‌ను బుధవారం కోర్టు విచారించింది. కోచ్‌‌కు ప్రయాణికులను పరిమితంచేసే నియమాన్ని ఉల్లంఘించే వారికి 6 నెలల జైలు శిక్ష విధించే సెక్షన్‌‌ను అమలు చేయాలని సూచించింది.