
నోరు ఆరోగ్యంగా ఉంటే మనస్సు ఆనందంగా ఉంటుంది. శుభ్రమైన దంతాలు వ్యక్తిత్వాన్ని ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యం కూడా ఉంచుతాయి. నోటి పరిశుభ్రత దంతాలు, చిగుళ్లు, నాలుకకు మాత్రమేకాదు.. గుండె, జీర్ణక్రియకు నేరుగా సంబంధం ఉంటుంది. ఆరోగ్యం,అందం గురించి ఇటీవల జరిగిన కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల అందం చెడిపోవడమే కాకుండా మీ శరీరంలో అనేక ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తున్నాయని తేలింది. ఈ సమయంలో దంతాలను ఆరోగ్యంగా ,బలంగా ఎలా చేసుకోవాలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
వేపలో అత్యధిక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.గతంలో ప్రజలు వేప, బబూల్,మామిడి టూత్‌పిక్‌లతో దంతాలను శుభ్రం చేసుకునేవారు. నేటికీ గ్రామాల్లోని ప్రజలు వేప టూత్‌పిక్‌లను ఉపయోగిస్తారు. నోటి పరిశుభ్రత నిజంగా చాలా ముఖ్యం. ఎందుకంటే నోటి నుండి వచ్చే అన్ని బ్యాక్టీరియా ,వైరస్‌లు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుని మంటను కలిగిస్తాయి. ఇది మధుమేహం,కొన్ని తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణం కావొచ్చు.
Also Read : పాదాల ఆరోగ్యం పట్టించుకోకపోతే
ఇది మాత్రమే కాదు.. ఇది గుండె సంబంధ సమస్యలను వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం..నోటి సమస్యల వల్ల ధమనులు మూసుకుపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. బాక్టీరియా,వైరస్ లు రక్తంలో కలిసిపోయి రక్త నాళాలలో వాపు స్థాయిని పెంచుతాయి. ఇది గుండెపోటు ,స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
దంతాలు ,దవడలు చెడిపోవడం వల్ల బ్యాక్టీరియా,ఇతర వైరస్ లు మెదడుకు చేరుకుని న్యూరాన్‌లను దెబ్బతీస్తాయి. అవి మెదడు కణాలను దెబ్బతీస్తాయి. ఇది జ్ఞాపకశక్తి తగ్గడం, మనోవైకల్యం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ శాస్త్రవేత్తల ప్రకారం..చిగుళ్ళను అనారోగ్యానికి గురిచేసే బ్యాక్టీరియా కూడా అల్జీమర్స్‌కు కారణమవుతుంది. నోటి పరిశుభ్రత, ఒత్తిడి-ఆందోళన ,నిరాశతో ఎక్కువ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి నోటిని శుభ్రపరిచే సహజ మార్గాలు.
యోగా, జీవనశైలిలో మార్పులు, బలమైన రోగనిరోధక శక్తికి సంబంధించిన ఆహారం తీసుకోవడం ద్వారా నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.
రోజువారీ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. శక్తి పెరుగుతుంది, బిపి నియంత్రణలో ఉంటుంది. బరువు నియంత్రణ, చక్కెర నియంత్రణ, నిద్రను మెరుగుపడుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.
బలమైన రోగనిరోధక శక్తికోసం..గిలోయ్-తులసి కషాయం తీసుకోవడం, రోజూ పసుపు పాలుతాగడం, కాలానుగుణంగా దొరికే పండ్లు తినడం, బాదం, -వాల్నట్ లాంటి తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.