సాధారణంగా ఒకరు ఎన్ని పోన్లు వినియోగిస్తారు.. మేనేజర్, పెద్ద వ్యాపారులు, సెలబ్రీటీలు వంటి వారు రెండు .. మహా అయితే మూడు లేదా నాలుగు ఫోన్లను వినియోగిస్తుంటారు. అయితే సుందర్ పిచాయ్.. గూగుల్ సీఈవో గురించి మనందరికి తెలిసిందే. కానీ అతను ఎన్ని ఫోన్లు వాడుతారో తెలుసా.. ఓ ఇంటర్వ్యూలో తాను అన్ని ఫోన్లు ఎందుకు వాడుతున్నారో కూడా తెలిపారు. వాస్తవానికి సుందర్ పిచాయ్ ఎన్ని ఫోన్లు వాడుతున్నారో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.. అయితే సుందర్ పిచాయ్ అన్ని ఫోన్లు వాడటం వెనక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం రండి.
Google ఫోన్లను తయారు చేస్తుంది అందరికి తెలుసు.. కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ లంతా వాటి పనితీరు , డిజైన్ అంచనా వేయడానికి పోటీదారు కంపెనీల ఫోన్లను వినియోగిస్తుంటారు. అయితే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా రెండెంకెల సంఖ్యలో ఫోన్లు వినియోగిస్తున్నారట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీని వెనక కారణం వేరే ఉందని అంటున్నారు సుందర్ పిచాయ్.
95 శాతం కంటే ఎక్కువ డివైజ్ లలో రన్ అవుతున్న ఆండ్రాయిడ్ ను కలిగి ఉన్న కంపెనీ గూగుల్.. దీనికి నాయకత్వం సుందర్ పిచాయ్ వహిస్తున్నారు. అయితే ఈ ఫోన్లలో పనిచేసే గూగుల్ కు సంబంధించిన ఉత్పత్తులకు కూడా అతను బాధ్యత వహిస్తారు. అందుకే అతని కోసం gmail, డాక్స్, Google ఫొటోలు వంటి అన్ని Google యాప్ లు అన్ని రేంజ్ లలోని ఫోన్లలో బాగా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కదా.. అందుకు అన్ని ఫోన్లు వాడుతున్నారు.
ఇంతకీ సుందర్ పిచాయ్ ఎన్ని ఫోన్లు వాడుతున్నారో తెలుసా.. అక్షరాల 20 ఫోన్లు.. ప్రతి కొత్త ఫోన్ ను ప్రయత్నిస్తుంటారు సుందర్ పిచాయ్. ఇది ఎందుకంటే ఉద్యోగ బాధ్యత అంటారు పిచాయ్. ప్రపంచ వ్యాప్తంగా Googl మొబైల్ వ్యాపారంలో Android పెద్ద భాగం. యాపిల్ కు అన్ని మూలాధారాలు లభిస్తుండగా.. ఆండ్రాయిడ్ బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు కోర్ యూజర్ బేస్ ను నిర్మించింది గూగుల్.
ఇన్ని ఫోన్లు వినియోగిస్తున్న ఏకైక టెక్ చీఫ్ సుందర్ పిచాయ్ ఒకరే కాదు.. ఈ రోజుల్లో ఎక్కువగా ఫోల్డబుల్ ఫోన్ గా ఉన్న ఆపిల్ , మైక్రోసాఫ్ ఎగ్జిక్యూటివ్ లు కూడా ఈ లిస్ట్ లోఉన్నారు. ఉద్యోగ బాధ్యతలో ఇది ఒక భాగం మరి.. ఆమాత్రం సెల్ ఫోన్లు మెయిన్ టెన్ చేయాల్సిందే..