టీవీ స్క్రీన్ నల్లగానే ఎందుకు ఉంటుంది.. మిగతా రంగుల్లో ఎందుకు ఉండదు ?

టీవీ స్క్రీన్ నల్లగానే ఎందుకు ఉంటుంది.. మిగతా రంగుల్లో ఎందుకు ఉండదు ?

టీవీ లేనిదే రోజు గడవదు. పొద్దున లేచినప్పటి నుంచి..రాత్రి పడుకునే వరకు టీవీనే కాలక్షేపం. ముఖ్యంగా గృహిణులు టీవీ చూడకుండా ఉండలేరు.  గంట తరబడి సీరియళ్లు, సినిమాలు చూస్తూ ఇంట్లో టైంపాస్ చేస్తుంటారు. అయితే రోజూ టీవీ చూస్తున్నా....ఒక్కటి మాత్రం గమనించరు. అదేంటింటే..టీవీ స్క్రీన్ నల్లగా ఉండటం. అసలు దీనిపై మీకెప్పుడైనా సందేహం వచ్చిందా...టీవీ స్క్రీన్ నల్లగానే ఎందుకు ఉంటుంది. వేరే రంగుల్లో ఎందుకు ఉండదని అనిపించిందా... ఆన్ చేసినప్పుడు..ఆఫ్ చేసినప్పుడు నల్లగానే ఎందుకు మారిపోతుందో తెలుసా..దీనికి సమాధానం తెలుసుకుందాం..

 
ఇదే కారణం...

టీవీ స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు అది సాధారణంగా నలుపు రంగులో కనిపిస్తుంది.  ఎందుకంటే డిస్‌ప్లే బ్యాక్‌లైట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి. కొన్ని టీవీల స్క్రీన్‌లు ఆఫ్ చేసినప్పుడు అవి నీలం( బ్లూ) లేదా ఎరుపు (రెడ్)  రంగులు కనిపిస్తాయి. దీనికి కారణం టీవీలోని సెట్టింగ్స్. 

 కలర్ మార్చాలంటే

టీవీ స్క్రీన్ నల్లగా కాకుండా మరో  కలర్లోకి మార్చాలంటే మనం మార్చుకోవచ్చు. సెట్టింగ్ లోకి వెళ్లి కలర్ ను మార్చుకోవచ్చు. అయితే కొన్ని టీవీల్లోని సెటింగ్స్ లో కలర్ మార్చుకునే అవకాశం ఉండదు. ఆ సమయంలో యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.  

స్క్రీన్ కారణంగానే నల్లగా...

టీవీ స్క్రీన్ నల్లగా ఉండటానికి కారణం ఏంటనే ప్రశ్నకు కొందరు వినియోగదారులు తమదైన శైలిలో సమాధానాలిచ్చారు. టీవీ ఆఫ్ చేసినప్పుడు స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ అయిపోతుందని..ఆ సమయంలో పిక్సెల్ నుంచి కాంతి విడుదల చేసే CRT,OLED, ప్లాస్మా స్క్రీన్ లు పూర్తిగా స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయని చెబుతున్నారు. అందుకే అవి నల్లగా మారిపోతాయంటున్నారు. సాధారణంగా టీవీ స్క్రీన్ లపై ఉండే అద్దం నల్లగా ఉండటం వల్ల టీవీ ఆఫ్ అయిపోయినప్పుడు స్క్రీన్ కూడా నల్లగా మారుతుందంటున్నారు.