ప్రస్తుతం చాలామంది ఇంట్లో ఉన్న కిచెన్లు అద్దంలా మెరుస్తున్నాయి. ఎందుకంటే కిచెన్ లో ఎక్కువగా నాన్ స్టిక్ పాత్రలే వాడుతున్నారు. ఇవి వాడటం వల్ల బౌల్స్ క్లీన్ చేయడం ఈసీ, ఫుడ్ ఆయిల్ కూడా ఆదా అవుతుంది. కానీ.. వీటి వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తేల్చి చెప్తోంది. హై టెపరేచర్ లో నాన్ స్టిక్ పై వంట చేసినప్పుడు అందులో నుంచి టాక్సిన్స్ విడుదల అవుతాయని ICMR హెచ్చరిస్తుంది.
నాన్ స్టిక్ పాత్రలతో ఈ రోగాలు వస్తాయి
నాన్ స్టిక్ ప్యాన్ పై ఉన్న టెఫ్లాన్ కోట్టింగ్ అరిపోయినట్లైతే వాటిని వాడకూదని తాజాగా ICMR మార్గదర్శకాలు విడుదల చేసింది. నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించడం వల్ల క్యాన్సర్, సంతానోత్పత్తి, శరీర నొప్పులు, హార్మోన్లలో అసమతుల్యత, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.
మనం యూజ్ చేసే నాన్‌స్టిక్ పాత్రలను పాలీ టెట్రాఫ్లోరో ఎథిలిన్(PTFE) అనే పదార్థంతో తయారుచేస్తారు. ఈ పదార్థాన్నే టెఫ్లాన్ అని కూడా పిలుస్తారు. కార్బన్, ఫ్లోరిన్ పరమాణువులతో టెఫ్లాన్ అనే సింథటిక్ రసాయన పదార్థం తయారవుతుంది. దీన్ని అడుగు భాగాన పోతగా పోసి నాన్‌స్టిక్ పాత్రలను తయారు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఆ విధంగా తయారుచేసిన నాన్‌స్టిక్ పూతపై ఏ చిన్న గీత పడినా టెఫ్లాన్ కోటింగ్ నుంచి విష వాయువులు, డేంజర్స్ కెమికల్స్ కుక్ చేసుకునే పదార్థాల్లో కలుస్తాయని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్ పరిశోదనలో తేలింది. ఒక్క గీత నుంచి 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు రిలీజ్ అవుతాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
ప్రమాదాన్ని తగ్గించాడనికి జాగ్రత్తలు:
- ఖాళీ ప్యాన్ ను ఎక్కువ సేపు వేడి చేయోద్దు. ఇలా చేస్తే టెఫ్లాన్ పూత త్వరగా కరిగిపోతుంది.
- వీలైనంత తక్కువ మంటపై వంటచేసుకోవాలి. 170 డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కవ టెంపరేచర్ లో వేడి చేస్తే నాన్ స్టిక్ డేంజరెస్ వాయువులను విడుదల చేస్తుంది.
- ఎటువంటి రసాయన పూతలు లేని గ్రానైట్ పాత్రలు, మట్టిపాత్రలు, ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, PFOA లేని సిరామిక్ పాత్రలు వంట చేసుకోవడానికి బెస్ట్ అని ఐసీఎంఆర్ చెప్తోంది.
- నాన్ స్టిక్ కోటింగ్ ను డ్యామేజ్ ( గీతలు) అయ్యేందుకు కారణమైయ్యే మెటల్ స్పూన్స్, స్టీల్ గంటెలు వాడకుండా సిలికాన్, చెక్క గరిటెలను ఉపయెగించండి.
- నాన్ స్టిక్ కోటింగ్ అరిగిపోయిన ప్యాన్స్, బౌల్స్ కు బదులు కొత్త పాత్రలు వాడాలి.