Airtel: మీది ఎయిర్టెల్ నంబరా.. ఖర్చు తక్కువలో ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే బెటర్..

Airtel: మీది ఎయిర్టెల్ నంబరా.. ఖర్చు తక్కువలో ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే బెటర్..

మనలో చాలామంది హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాను ఆస్వాదించేందుకు వై-ఫై కనెక్షన్ వాడుతుంటారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు కూడా వై-ఫైని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఓటీటీలో హై క్వాలిటీలో సినిమాలను, వీడియోలను వీక్షించేందుకు కేబుల్కు బదులు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న వాళ్లూ ఉన్నారు. ఇంట్లో ఉన్నంత సేపు వైఫైని కనెక్ట్ చేసుకుని, ఆఫీస్కు వెళ్లాక కూడా వైఫైకి కనెక్ట్ చేసుకునే ఇంటర్నెట్ను పొందే జనం మన దేశంలో కోట్లలో ఉన్నారు. సో.. ఇలాంటివాళ్లకు మొబైల్ డేటాతో పెద్దగా పని ఉండకపోవచ్చు. 

అసలు మొబైల్ డేటానే వీళ్లకు అక్కర్లేదని కాదు కానీ లిమిటెడ్ డేటా సరిపోతుంది. అలాంటి వాళ్లలో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లు ఉంటే వాళ్లకో గుడ్ న్యూస్. 509 రూపాయల ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు, 6జీబీ హై స్పీడ్ డేటాను పొందొచ్చు. 1000 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. 84 రోజులకు 6జీబీ డేటా సరిపోతుందా అనే డౌట్ రావొచ్చు.

ఇంట్లో, ఆఫీస్లో వైఫై వాడే వాళ్లకు దాదాపుగా సరిపోతుంది, సరిపెట్టుకోవచ్చు. ఎందుకంటే.. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే డేటా అవసరం పడే ఛాన్స్ ఉంది. అయినా సరే డేటా సరిపోలేదనుకుంటే.. డేటా ప్లాన్స్ ఉండనే ఉన్నాయి. 99 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 20 జీబీ డేటాను 2 రోజుల వ్యాలిడిటీతో పొందొచ్చు. లేదు.. వ్యాలిడిటీ సరిపోదనుకుంటే.. 121 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ హై స్పీడ్ డేటా పొందొచ్చు. ఎగ్జిస్టింగ్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు ఈ డేటా ప్లాన్ను ఆస్వాదించొచ్చు.

భారత్లోని ప్రముఖ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. రీఛార్జ్ ప్లాన్ల ధరలను దాదాపు 15 శాతం పెంచడంతో యూజర్లు ఖర్చు తగ్గించుకునేందుకు యూజర్లు ప్రత్యామ్నయాల కోసం అన్వేషిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాత్రమే ప్రొవైడ్ చేసే రీఛార్జ్ ప్లాన్స్ అంటూ ఏవీ లేకపోవడం గమనార్హం. అవసరం ఉన్నా, లేకపోయినా డేటాతో కూడిన ప్లాన్స్నే రీఛార్జ్ చేసుకోక తప్పని పరిస్థితి. అందుకే కాల్స్ మాత్రమే అవసరం అని భావించే యూజర్లు తక్కువ డేటా వచ్చినప్పటికీ ఎయిర్టెల్ ప్రొవైడ్ చేస్తున్న 509 రూపాయల ప్లాన్స్ వంటి వాటితో రీఛార్జ్ చేసుకుంటున్నారు.