ఎందుకు అనసూయ..వెక్కి వెక్కి.. ఏడుస్తుంది..అయ్యో పాపం

ఎందుకు అనసూయ..వెక్కి వెక్కి.. ఏడుస్తుంది..అయ్యో పాపం

ప్రముఖ టీవీ యాంకర్​ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకరింగ్‌ తోపాటు వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదస్పదమైన న్యూస్ తో నిలిచే అనసూయ..గుక్కపెట్టి ఏడ్చింది. రీసెంట్ గా అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. కారణం ఏంటనేది తెలియదు.. కానీ, అనసూయ ఏడ్చే వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అనసూయ పైకి మాత్రం స్ట్రాంగ్ లేడీగా కనిపిస్తూ..లోపల ఇంత బాధ ఎందుకు? అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఎందుకు ఏడుస్తుంది.. ఏం జరిగింది..అనేది మాత్రం సస్పెన్స్ ఉండటంతో..అనసూయ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

 

 

ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవుతుండటంతో..అనసూయకి మద్దతుగా నిలుస్తూ ధైర్యం ఇస్తున్నారు ఫ్యాన్స్. ఆ మధ్యన అనసూయ పట్ల కొంత మంది నెటిజన్స్ అబ్యుసింగ్ వర్డ్స్ అన్నందుకు..అనసూయ రిప్లై ఇస్తూ.. 'దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు..'అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ వీడియోతో పాటు ఒక నోట్ కూడా రాసింది అనసూయ.  ఆ నోట్ లో..  మీరందరూ బానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈ పోస్ట్ చూసి మీరు కంగారుపడతారు. కానీ నేనేం చెప్పాలనుకున్నాను అంటే.. సోషల్ మీడియా అనేది సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు, ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి. కానీ ప్రెజెంట్ సోషల్ మీడియాలో జరుగుతుంది వేరు. ఈ పోస్ట్ ఎందుకు పెడుతున్నాను అంటే నేను ఏ ఫోటోషూట్ చేసినా అది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా బాధని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నా లైఫ్ లో కూడా బాధాకరమైన రోజులున్నాయి. మనం నమ్మే విషయాలపై నెగిటివ్ ఎదురైతే బాగా ఏడ్చి.. మళ్ళీ గట్టిగా ప్రపంచాన్ని ఎదుర్కోవాలి. గ్యాప్ తీసుకోండి కానీ వదిలేయొద్దు, తిరిగి మళ్ళీ మొదలుపెట్టండి అని పోస్ట్ చేసింది అనసూయ.