ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. పురాణాలు ఏం చెబుతున్నాయి..

ముక్కోటి  ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. పురాణాలు ఏం చెబుతున్నాయి..

హిందూ పురాణాల ప్రకారం ఏకాదశి.. చాలా పవిత్రమైన రోజు... ఇక ముక్కోటి ఏకాదశి అంటే మహా పవిత్రమైన రోజని ఆధ్యాత్మిక వేత్తలు  చెబుతున్నారు.  ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 10 వ తేది వచ్చింది. ఆ రోజున ముక్కోటి దేవతలు కలిసి శ్రీమన్నారాయణుని దర్శించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.   మధు.. కైటవులు అనే రాక్షసులకు .. విష్ణుమూర్తి ... ఉత్తర ద్వార దర్శనం కల్పించి..ముక్తిని ప్రసాదించాడు.  అందుకే ఆ రోజు ఉత్తరద్వార ముఖంగా స్వామిని దర్శించుకొని ఉపవాస దీక్షను పాటిస్తారు.  ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)రోజున ఎందుకు ఉపవాసం ఉండాలో తెలుసుకుందాం. . .

ముక్కోటి  ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. పుష్య మాసం శుక్ల పక్షం ..  ఏకాదశి రోజు ( జనవరి 10 ) ముర అనే రాక్షసుడు  బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. అదే రోజు మురాసురుడు అనే రాక్షసుడిని  శ్రీమన్నారాయణుడు  సంహరించారు.   అందుకే  ముక్కోటి ఏకాదశి రోజున  కేవలం తులసి నీళ్లే స్వీకరిస్తారు. ఆ రోజున భక్తులంతా ఉత్తర ద్వార ముఖంగా స్వామి దర్శించుకొని ఉపవాస దీక్షను పాటిస్తే  సకలైశ్వర్యాలూ సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. 

పద్మ పురాణం ప్రకారం.. 

పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ... ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు ముక్కోటి ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువు..  ముర అనే రాక్షసుడిని  సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి.. తనలో నుంచి ఉద్భవించిన శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. 

విష్ణువు వరమివ్వడంతో.. ఏకాదశి ఇలా అడుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను సంహరించాలని ఆమె కోరింది. దాంతో విష్ణువు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిస్తాడు. ముక్కోటి  ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. 

ముర ...అంటే... తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి, జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయకుండా తరువాతి రోజు చేయడం వలన నాలుకకు భోజనం రుచి తెలుస్తుంది. అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి.. భగవద్గీతను కూడా దానం చేస్తారు.