ఫాదర్స్​డేని ఆ దేశాల్లో ఎందుకు వేరే తేదీల్లో సెలబ్రేట్ చేసుకుంటారో మీకు తెలుసా..?

ఫాదర్స్​డేని ఆ దేశాల్లో ఎందుకు వేరే తేదీల్లో సెలబ్రేట్ చేసుకుంటారో మీకు తెలుసా..?

ప్రతి ఏటా జూన్​ మూడో ఆదివారం ఫాదర్స్ డే సెలబ్రేషన్స్​ ప్రపంచమంతా చేసుకుంటారు. ఈ ఏడాది ఫాదర్స్​ డే జూన్ 16న వచ్చింది. మనదేశంతో పాటు 80 దేశాలు ఇదే రోజున ఫాదర్స్​ డేగా సెలబ్రేట్ చేసుకుంటాయి. కానీ, మరికొన్ని దేశాలు వేరే తేదీల్లో ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాయి. ఆ దేశాలు ఏవి? ఎందుకు ఆ దేశాల్లో డేట్​ మారింది? ఆ వివరాలే ఇవి.

స్పెయిన్​, ఇటలీ, పోర్చుగల్​ దేశాల్లో ఫాదర్స్ డేని మార్చి 19న చేసుకుంటారు. దీన్ని సెయింట్​ జోసెఫ్ పండుగ అంటారు. ఆ రోజున కుటుంబం అంతా కలిసి విందు చేస్తారు. స్వీట్లు తినిపించుకుని, చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. స్పెయిన్​లో హ్యాపీ ఫాదర్స్​ డే చెప్పాలంటే ‘ఫెలిజ్ డియా డెల్ పాడ్రే’ అని విష్ చేయాలి. 

జర్మనీలో ఫాటర్​టాగ్

జర్మనీలో ఫాదర్స్ డే రోజు పబ్లిక్ హాలిడే. హాలిడే కావడంతో ఫ్యామిలీతో ఎక్కువ టైం గడుపుతారు. అక్కడి సంప్రదాయం ప్రకారం.. ఆ రోజు రంగురంగుల బట్టలు వేసుకుంటారు. ట్రాన్స్​పోర్ట్ వెహికల్​ వ్యాగన్​ని తీసుకుని, అందులో ఫుడ్​ నింపుకుని హైకింగ్ చేసేందుకు వెళ్తారు. ఆ రోజు తండ్రులంతా టీనేజ్​ అబ్బాయిల్లా ప్రవర్తిస్తారు. ఫాదర్స్​డేని ‘ఫాటర్​టాగ్’​ అని కూడా పిలుస్తారు.

ఆర్మీ తండ్రుల కోసం..

రష్యాలో ప్రతి ఏటా ఫాదర్స్ డేకి పెద్ద పరేడ్​ నిర్వహిస్తారు. ఆర్మీలో ఉన్న తండ్రుల గౌరవార్థం ఇలా చేస్తారు. అయితే, ఫాదర్స్ డే రోజు తండ్రులకు మాత్రమే గిఫ్ట్ ఇస్తుంటారు పిల్లలు. కానీ, రష్యాలో మాత్రం ముఖ్యమైన మగవాళ్లందరికీ ఆడవాళ్లు గిఫ్ట్స్ ఇస్తారు. ఈ డేని తండ్రుల కోసమే కాకుండా అన్నదమ్ములు, కొడుకులు, ఫ్రెండ్స్ ఇలా అందరికీ సంబంధించిందిగా భావిస్తారు. ఒక విధంగా మెన్స్ డేలా చేస్తారన్నమాట.

మెక్సికో మారథాన్​

మెక్సికోలో 21కె మారథాన్​లో తండ్రులు పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఈవెంట్​ని ‘కర్రెరా డియా డెల్ పాడ్రె’ అంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని విందు చేస్తారు. వేడుకల్లో భాగంగా హెల్త్​ ఇంపార్టెన్స్ గురించి తెలియజేసే యాక్టివిటీలు ఉంటాయి. అప్పుడే కుటుంబ వ్యవస్థ, దాని విలువల గురించి చెప్పుకుంటారు. 

  •     థాయి​లాండ్​లో డిసెంబర్​ 5న ఫాదర్స్ డే. ఆ రోజు ఎందుకంటే కింగ్​భుమిబోల్ బర్త్​డే. మొదట్లో ఆ రోజున ట్రెడిషన్స్​ ప్రకారం సెలబ్రేట్ చేసేవాళ్లు. ఇప్పుడు అదే నేషనల్ ఫాదర్స్ డేగా మారింది. తండ్రి, తాత, ముత్తాతలపై పూల వర్షం కురిపిస్తారు. 
  •     నెదర్లాండ్స్, బెల్జియం దేశాల్లో ఫాదర్స్ డే రోజు గిఫ్ట్స్ ఇస్తారు. 
  •     స్వీడన్​లో నవంబర్ రెండో ఆదివారం ఫాదర్స్ డే చేసుకుంటారు. చేత్తో చేసిన క్రాఫ్ట్స్, టైల వంటివి గిఫ్ట్​ ఇస్తారు. ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేసి సరదాగా గడుపుతారు.
  •     జపాన్​లో జూన్​ రెండో వారం ఫాదర్స్​డే జరుపుకుంటారు. సంప్రదాయ భోజనం తింటారు. బహుమతులు, పూలు ఇచ్చిపుచ్చుకుంటారు.
  •     బ్రెజిల్​ దేశంలో ఫాదర్స్ డేని ఆగస్టు​ రెండో వారంలో చేసుకుంటారు. ఈ అలవాటు ఎప్పటినుంచో ఉంది. ఆ రోజు పిల్లలంతా తమ తండ్రుల కోసం స్పెషల్​గా గ్రీటింగ్​ కార్డ్స్ తయారు చేస్తారు. ఫ్యామిలీ మొత్తం కలిసి బార్బెక్యు స్పెషల్స్​ చేసుకుని తింటారు.