Jio: జియో సిమ్ వాడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీలవుతారో..!

Jio: జియో సిమ్ వాడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీలవుతారో..!

భారత్లో టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్లు అమాంతం పెంచేశాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా (వీఐ) రీఛార్జ్ ప్లాన్స్ ధరలు యావరేజ్గా 15 శాతం పెరిగాయి. కొందరు ఈ బాదుడు తట్టుకోలేక బీఎస్ఎన్ఎల్కు షిఫ్ట్ అయిపోయారు. కానీ.. మెజార్టీ యూజర్లు మాత్రం డేటా స్పీడ్ గురించి ఆలోచించి, కనెక్టివిటీ సమస్యలు తక్కువగా ఉంటాయనే కోణంలో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్స్నే వాడుతున్నారు. కానీ.. వాడుతూనే రీఛార్జ్లకు గతంలో కంటే అదనంగా చెల్లించక తప్పడం లేదని నిట్టూరుస్తున్నారు. అలా వర్రీ అవుతున్న  వాళ్లకు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న విషయం కొంత ఊరట కలిగించే విషయమే. అయితే.. ఇంట్లో, ఆఫీస్లో వైఫై వాడుతున్న వారికి మాత్రమే ఉపయోగకరమైన సలహా ఇది. జియో యూజర్లకు మాత్రమే.

ALSO READ | BSNL vs Reliance Jio vs Airtel: రీఛార్జ్ ప్లాన్ రేట్లు పెరిగిపోయాయని వర్రీనా..? నో ప్రాబ్లం.. ఈ వార్త మీకోసమే..!

జియోలో 84 రోజులకు గానూ 470 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ బెన్ఫిట్స్ ఏంటంటే.. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 6 జీబీ డేటా, 1000 ఎస్ఎంఎస్లు. ఇంట్లో, వర్క్ ప్లేస్లో వైఫై ఉన్నవాళ్లకు మొబైల్ డేటాతో పెద్దగా అవసరం పడకపోవచ్చు. బయటకు వెళ్లినప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ చేయడానికో, వాట్సాప్ చాట్కో.. ఇలాంటి చిన్నచిన్న అవసరాలకు తప్ప జీబీలకు జీబీలు ఖర్చు చేయాల్సినంత అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటివారికి జియోలోని 470 రూపాయల ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ ఉండటం వల్ల మంత్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

ALSO READ | ఐడియా ప్లాన్ అదిరింది : డైలీ 2 GB డేటా.. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు..!

ఒకవేళ.. ఈ ప్లాన్లో భాగంగా లభించే 6 జీబీ డేటా ఈ 84 రోజుల్లో ఖర్చయిపోయినా "True Unlimited Upgrade" Plans పేరుతో డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. 51 రూపాయలకు 3 జీబీ, 101 రూపాయలకు 6జీబీ, 151 రూపాయలకు 9జీబీ 4జీ స్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు.. ఈ ప్లాన్స్ 5జీ యూజర్లకు అన్ లిమిటెడ్ డేటాతో అందుబాటులో ఉన్నాయి. బేస్ ప్లాన్ వ్యాలిడిటీ ఎన్ని రోజుల వరకూ ఉందో.. అన్ని రోజుల వ్యాలిడిటీతో ఈ డేటా ప్లాన్స్ బెన్ ఫిట్స్ పొందొచ్చు.