కేసీఆర్‌ లక్ష కోట్లు దోచుకుని కూలుతున్న కాళేశ్వరం కట్టిండు : ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుపై కేసీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు.  కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు దోచుకుని కూలుతున్న కాళేశ్వరం కట్టారని ఆరోపించారు.  కోదాడలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో  మాట్లాడారు.  

కృష్ణా జలాలపై కేసీఆర్,హరీష్ రావు మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. కృష్ణా నది నుండి 8 టీఎంసీల నీళ్లను ఆంధ్రకు తరలించడం నిజం కాదా అన్ని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన పదేండ్లలోనే  ఆంధ్రకు ఎక్కువ మేలు జరిగిందన్నారు.  

ALSO READ :- బ్యాట్, బాల్ పట్టిన పురోహితులు.. ఫోర్లు, సిక్సర్లతో దద్దరిల్లిన మైదానాలు

కేసీఆర్‌, జగన్‌ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు.  ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్‌ అడ్డు చెప్పలేదని.  మన నీళ్లు ఏపీ రాష్ట్రానికి వెళ్తుంటే కేసీఆర్‌ నిశ్శబ్దంగా ఉన్నారని తెలిపారు.  మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని విజిలెన్స్‌ నివేదిక వెల్లడించదని..  అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు.    కృష్ణా ప్రాజెక్టులపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.