Family Matters : పెళ్లంటే భయమెందుకు..? యువతలో ఉన్న భయాలు ఏంటీ..?

Family Matters : పెళ్లంటే భయమెందుకు..? యువతలో ఉన్న భయాలు ఏంటీ..?

లైఫ్ లో సెటిల్ అవ్వడం అంటే.. చదువుకుని, ఉద్యోగం సంపాదించి,  పెళ్లిచేసుకోవడం. ఇదే మొన్నటిదాకా అందరి ఫార్ములా.. అయితే ఇప్పుడిప్పుడే రోజులు మారుతున్నాయి. వయసు పెరిగిపోతున్నా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నారు చాలామంది. అదేమంటే 'అంత రిస్క్ చేయలేం' అంటున్నారు. ఇంతకీ పెళ్లిలో అంత రిస్క్ ఉంటుందా? పెళ్లంటే ఎందుకంత భయం ? రిలేషన్ షిప్ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. .  .

పెళ్లి గురించి కలలు కంటూ ఊహల్లో తేలిపోయే రోజులు పోయాయి. యువత ఎక్కువగా ఉన్న మనదేశంలో అందరూ చదువు కంప్లీట్ చేసుకుని, ఉద్యోగాలు, వ్యాపారాలు, స్టార్టప్ లు  అంటూ కాంపిటేటివ్ ప్రపంచంలో  బిజీగా ఉంటున్నారు. ఇంట్లో వాళ్లు చేసి పెళ్లి గురించి టాపిక్ ఎత్తితే. నాకు ఇప్పుడే వద్దు అంటున్నారు. పోని ముప్నై దాటిన తర్వాత అడిగితే.. అప్పటికీ అదే మాట. అసలు పెళ్లే  వద్దంటున్నారు. మ్యారేజ్ సిస్టమ్ మీద నమ్మకు లేకో లేదా పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టం లేకో  అయితే ఓకే. కానీ ఈ రోజుల్లో  చాలామంది యువత పెళ్లి తర్వాత ఎదురయ్యే కొన్ని చిన్న చిన్న భయాలతోనే పెళ్లికి దూరంగా ఉంటున్నారట. 

అవి ఎలాంటివంటే.. 

పెళ్లి తర్వాత ఫ్రీడమ్ ఉండదేమో?  కెరీర్ కాంప్రమైజ్ చేయాల్సి వస్తుందేమో? వచ్చే పార్టనర్ ఎలా ఉంటారో? ఇలాంటి  భయాల వల్లే చాలామంది పెళ్లికి దూరంగా ఉంటున్నారని సర్వేలు చెప్పున్నాయి. పెళ్లికి ముందు ఇలాంటి భయాలు ఉండడం మామూలే కానీ ఈ భయాల కోసం నిజంగా పెళ్లిని దూరం పెట్టాల్సిందేనా? రిలేషన్ మిస్ నిపుణులు ఏమంటున్నారు?

కాంప్రమైజ్ అవ్వాలా?

పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అయితే కాంప్రమైజ్ అనేది మనల్ని బాధ పెట్టే విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి మనకు నచ్చి కాంప్రమైజ్ అవుతాం. అది ఎంతో అనందాన్ని ఇస్తుంది కూడా. అందుకే కాంప్రమైజ్ అనేది సందర్భాన్ని బట్టి పాజిటివ్, నెగెటివ్ గా మారుతుంది. కాబట్టి బలమైన వ్యక్తిత్వం ఉన్న వాళు కాంప్రమైజ్ అన్న విషయం గురించి భయపడాల్సిన పని లేదు. 

పెళ్లితర్వాత జీవితంలో అందమైన, అద్భుతమైన విషయాలెన్నో జరగొచ్చు. కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అవుతారు. లేకపోతే లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి తెచ్చుకోవడం, పెళ్లి మీద భయాన్ని పెంచుకోవడం అనవసరం అంటున్నారు నిపుణులు. ఒకవేళకాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే అది మీ  లైఫ్ పార్టనర్ కోసమో, పిల్లల కోసమో అవ్వాల్సి వస్తుంది. అది తప్పు కాదు. ప్రేమతో కాంప్రమైజ్ అవ్వడం వ్యక్తిత్వాన్ని చంపుకున్నట్టు కాదు అని రిలేషన్ షిప్ నిపుణులు చెపుతున్నారు.