ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ అమెరికాలో బంద్ అయ్యింది. అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలతో యాప్ సేవల్ని నిలిపివేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం నేరుగా యూజర్లకు తెలిపింది. 'అమెరికాలో టిక్ టాక్ ను బ్యాన్ చేసేందుకు తీసుకొచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి రానుంది.
అయితే యాప్ మాత్రం తాత్కాలికంగా అందుబాటులో ఉంటుంది అంటూ మెసేజ్ లు పంపింది. ఈ యాప్ అమెరికా యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ అయిన 'బైట్ డాన్స్' ద్వారా చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని అగ్రరాజ్యం ఆరో పించింది.
చైనా కాకుండా అమెరికా కేంద్రంగా TikTok పని చేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకు 'బైట్ డాన్స్' అంగీకరించలేదు. ఇదిలా ఉండగా.. 2017లో ప్రారంభమైన టిక్ టాక్ ను భారత్ సహా అనేక దేశాలు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.