జపనీస్ అమ్మాయిలు చూడడానికి బుట్టబొమ్మల్లా కనిపిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు కూడా. మిగతా వాళ్లతో పోలిస్తే వాళ్ల ఆయుష్షు కూడా ఎక్కువే అని స్టడీస్ చెస్తున్నాయి. అక్కడి మహిళలను 'మీ అందానికి, ఆరోగ్యానికి సీక్రెట్ ఏంది? అని అడిగితే... వాళ్ళు 'స్పెషల్ ఏం ఉండదు..' అని నార్మల్ గా చెప్తారు. కారణం వాళ్ల లైఫ్ స్టైట్ కొత్తగా మార్చుకున్నది ఏమీ లేదు. ఎన్నో తరాల నుంచి అలవాటుగా వస్తున్నవే వాళ్లు ఫాలో అవుతున్నారు.
జపాన్ దేశం ఎన్నోరకాల సంప్రదాయలకు పెట్టింది పేరు. జపనీస్ కల్చర్ అన్నింటికన్నా తేడాగా ఉంటుంది. రోజులో చేసే ప్రతిపనినీ వాళ్లు ఆనందంగా చేస్తారు. వాళ్ల ఆచారాలన్నీ మనిషి మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు చేసేవిగానే ఉంటాయి. అందుకే అవి వాళ్ల లైఫ్ స్టైల్లో భాగమయ్యాయి. అసలు ఏ కారణాల వల్ల వాళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉన్నారో చూద్దాం.
గ్రీన్ టీ
ఆరోగ్యం బాగుండాలని ఈ మధ్య ప్రతి ఒక్కరు గ్రీన్ టీ ప్రిఫర్ చేస్తున్నారు. దీన్ని చైనాలో ఎనిమిదో శతాబ్దం నుంచే వాడుతున్నారు. అలాగే జపాన్లో కూడా ఈ గ్రీన్ టీ ఎప్పుడో భాగమైంది. దీనివల్ల కూడా వాళ్లకు ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి. ఈ గ్రీన్ టీని చాలా సంప్రదాయాల్లో ట్రీట్ మెంట్ కు వాడేవాళ్లు. మనదేశంలో కూడా దెబ్బలు తగిలినప్పుడు రక్తస్రావం తగ్గేందుకు ఉపయోగించేవాళ్లు. అలాగే జీర్ణశక్తి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
పులిసిన ఫుడ్
జపనీయులు ఎక్కువగా ఫెర్మెంటెడ్ ఫుడ్ (పులియబెట్టిన ఆహారం) తీసుకుంటారు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రొబయోటిక్స్, విటమిన్-బి అందుతాయి. జపాన్లో ఎక్కువగా సోయాబీన్స్ తోపులియబెట్టిన 'నాలో అనే పదార్థాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తిని అందిస్తుంది.
సీ ఫుడ్
సీ ఫుడ్ ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే అందులో విటమిన్స్. ప్రొటీన్స్, మినరల్స్, ఒమెగా 3 ఫాటీ యాసిడ్స్ అధిక సంఖ్యలో ఉంటాయి. పైగా శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి సీ ఫుడ్ జపనీస్ వంటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్వీడ్ ఫిష్, ఆక్టోపస్, ఈల్, షెల్ ఫిష్, సాల్మన్, ట్యూనా వంటి ఎన్నోరకాలసీ ఫుడ్ వీళ్ల రెగ్యులర్ మీల్స్ ఉంటాయి. అలాగే అన్నంలో ఎక్కువగా గ్రిల్ చేసిన సీ ఫుడ్ ని ఉంటారు.
తక్కువ మోతాదు
జపాన్ వాళ్ల కల్చర్ భోజనంలో.. 'ఇలిజు- 'సన్నాయ్' లేదా 'షన్ కప్, త్రీసైడ్స్' అనే సూత్రాన్ని పాటిస్తారు. అంటే భోజనంలో వాళ్లు రెగ్యులర్ గా అన్నం లేదా నూడుల్స్ తింటారు. దాంతో పాటు చేపలు, కోడి మాంసం, పంచి మాంసం, గొడ్డు మాంసం, కూరగాయ పచ్చళ్లు, మీసో సూప్ కచ్చితంగా ఏమైనా రెండు పదార్థాలు తీసుకుంటారు. చూడటానికి ఎక్కువ ఐటమ్నీ ఉన్నా, వాటిని తక్కువ మోతాదులో తింటారు. ఇలా రకరకాల పంటలను మితంగా తినడం వల్ల.. అన్నిరకాల పోషణాలు శరీరానికి అందుతాయి.
హడావిడిగా తినరు
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో.. ఒక చోట కూర్చుని తినే తీరిక, ఆసక్తి ఎవ్వరికీ ఉండట్లేదు. కానీ జపాన్ వాళ్లు అలా తినడానికి ఇష్టపరరు. భోజనం చేయడాన్ని వాళ్లు చాలా పవిత్రంగా భావిస్తారు. కింద కూర్చుని నిదానంగా, అన్ని రకాల పదార్థాలను ఇష్టంగా ఆస్వాదిస్తారు. దానివల్ల తిన్న ఆహారం ఆరోగ్యంగా ఒంటికి పడుతుంది. టీవీ చూస్తూ తినడం. రెండు ముద్దలో భోజనం పూర్తి చేయడం లాంటి పనులు చేయరు వాళ్ళు.
మార్షల్ ఆర్ట్స్
జపనీయులు కొన్ని శతాబ్దాల నుంచే మార్గల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పురుషులే కాదు. మహిళలు కూడా మారటీ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తారు. దానివల్ల వాళ్లలో మనోధైర్యం పెరుగుతుంది. దీన్ని వాళ్లు నాలుగు గోడల మధ్య కాకుండా. ప్రకృతి ఒడిలో సాధన చేస్తారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి. టోటల్ బాడీ పర్మపుట్ వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అందుకే గుండె సంబంధిత సమస్యలు వీళ్లలో తక్కువగా కనిపిస్తాయి. మార్షల్ ఆర్ట్స్ వల్ల సెల్ఫ్ డిఫెన్స్ తోపాటు వెయిట్ లాస్ కూడా సులభంగా జరుగుతుంది. చాలా మంది జపాన్ అమ్మాయిలు అందుకే స్లిమ్ గా ఉంటారు.
అందర్నీ కలుపుకుని
అక్కడి వారు పండుగలకో, పబ్బానికో కాకుండా.. బంధువులు, స్నేహితులను రెగ్యులర్ గా కలుస్తారు. ఒక్క రోజు సెలవు దొరికినా, ఫ్యామిలీని తీసుకుని పిక్నిక్ లకు వెళ్తుంటారు. కావాల్సిన వాళ్లను కలుస్తారు. దానివల్ల ఎలాంటి మానసిక ఒత్తిళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అన్ని దేశాల్లోకంటే జపాన్ రెస్టారెంట్లలో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే జనం బయట తినదానికి ఆసక్తి చూపిస్తారు. రోజూ ఇంట్లోనే వండుకుని తిన్నా, వీకెండ్స్ లో మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ రకరణాల రుచులను రెస్టారెంట్లలో టేస్ట్ చేస్తారు. చాలామంది మహిళలు బ్యాచ్లుగా ఏర్పడి వ్యాయామాలు, వాక్, రన్ మారథాన్లు చేస్తారు. అందుకే వాళ్లలో డిప్రెషన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండే వాళ్ల సంఖ్య ఎక్కువ.
(వెలుగు లైఫ్)