కాదేదీ చంపడానికనర్హం అన్నట్లు తయారైంది ఇప్పుడు పరిస్థితి. ఇయర్ ఫోన్ కేబుల్స్ కూడా చంపడానికి ఆయుధాలుగా మారుతున్నాయంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో చూడండి. నవమాసాలు మోసిన తల్లి.. అప్పుడే పుట్టిన పసికందును ఇయర్ ఫోన్ కేబుల్స్ బిగించి చంపేసింది. అప్పుడే పిట్టిన బిడ్డను చెత్త కుప్పల్లో పడేసిన స్టోరీ చూశాం గానీ.. కేబుల్స్ తో చంపిన స్టోరీ ఇప్పుడే వింటున్నాం.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కసరాగడ్ జిల్లాలో బడియడ్క టౌన్ లో2020, డిసెంబర్ 15న ఓ కుటుంబం షాకయ్యే ఘటన జరిగింది. కడుపున పుట్టిన ముక్కు పచ్చలారని పసికందును ఇయర్ ఫోన్స్ తో బిగించి చంపి బెడ్ కింద చుట్టి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటనతో కుటుంబం అంతా షాక్ కు గురైంది.
అయితే 2020, డిసెంబర్ 15 నాడు కుటుంబం అంతా బంధువుల ఇంట్లో వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆ మహిళ అక్కడి నుంచి వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది. భర్త, అత్తమామలు వచ్చే సరికి ఆమె రక్తస్రావంతో ఇబ్బంది పడటం గమనించారు. అయితే వెంటనే కసరగాడ్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గెనకాలజిస్ట్ స్కానింగ్ చేసి ఆమె ఇందాకే డెలివరీ అయ్యిందని చెప్పేసరికి అంతా షాక్ అయ్యారు.
ALSO READ | వయనాడ్ వరదలు: హెలికాఫ్టర్లతో కాపాడినందుకు 132 కోట్లు కట్టాలా.. బాబ్బాబు కొంచెం తగ్గించుకోండి
అయితే తన భార్య గర్భవతి అయిన సంగతి తనకు తెలియదని, డెలివరీ ఎలా అవుతుందని డాక్టర్ ను ప్రశ్నించాడు భర్త. ఇంటికెళ్లి వెతుకు తెలుస్తుందని డాక్టర్ చెప్పడంతో ఇంటి దగ్గర వెతకగా.. బెడ్ కింద ప్యాక్ చేసిన బండిల్ కనబడిందట. చూస్తే చనిపోయిన పాప.. ఇయర్ ఫోన్స్ మెడకు బిగించి చనిపోయిన స్థితిలో ఉండటంతో చాలా ఆవేదనకు గరైంది ఆ ఫ్యామిలీ.
అయితే మొదటి సంతానంగా బాబు పుట్టాడంట ఆ దంపతులకు. అయితే బాబు పుట్టిన 3 నెలలకే ఆమె ప్రగ్నెంట్ కావడంతో భర్తకు, అత్త మామలకు చెప్పకుండా రహస్యంగా ఉంచిందట. మూడు నెలలకే మళ్లీ ప్రగ్నెంట్ అంటే ఇష్టం లేని ఆమె.. కుటుంబ సభ్యులకు చెప్పకుండా మేనేజ్ చేసింది. అయితే కొన్నాళ్లకు ఆమె కడుపు పెరుగుతున్నట్లు గమనించిన భర్త.. ప్రగ్నెంటేమోనని అడగగా.. గ్యాస్ ట్రబుల్ తో కడుపు ఉబ్బిందని కవర్ చేసిందట. అయితే తొమ్మిది నెలల వరకు డౌట్ రాకుండా అలాగే మేనేజ్ చేసిందంటే ఎంత తెలివిగా వ్యవహరించిందో చూడండి. చివరికి 2020, డిసెంబర్ 15న పాపకు జన్మనివ్వడం.. వెంటనే ఇయర్ ఫోన్స్ కేబుల్ తో బిగించి చంపడం జరిగిపోయాయి.
ఈ ఘటన తెసిని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. పసిపాపను చనిపోయిన 23 రోజుల తర్వాత 2021, జనవరి 7న బడియడ్క పోలీసులు ఆ 26 ఏళ్ల తల్లిని అరెస్టు చేశారు. అయితే ఇందులో ట్విస్టు ఏంటంటే సరిగ్గా నాలుగేళ్ల తర్వాత.. బడియడ్క సెషన్స్ కోర్టు ఆమెను విచారించడానికి బదులు ఆమెను విడుదల చేసింది. దీనికి కారణం అరెస్టు తర్వాత పోలీసులు ఆమె మానసిక పరిస్థితిని తెలుసుకోవడంలో విఫలమయ్యారని.. అందుకే ఆమెను విడుదల చేసినట్లు ఆమె తరఫు లాయర్ తెలిపారు. అయితే ఆమె పాపను హత్యచేసినట్లు రుజువు చేశామని కానీ.. ఆమె మానసిక పరిస్థితిని నిర్ధారణ చేయక పోవడంతో కోర్టు ఆమెను విడుదల చేసిందని పోలీసులు తెలిపారు.
కోర్టు నుండి విడుదలైన తర్వాత భార్య భర్తలు విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారు. భర్త అబ్రాడ్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే మొదటి సంతానంగా పుట్టిన బాబు మాత్రం తల్లి దగ్గరే ఉంటున్నాడు. చూడండి.. భార్య భర్తల మధ్య అవగాహన లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో. మొదటి సంతానం తర్వాత ఎప్పుడు పిల్లల్ని కనాలో ఫ్యామిలీ ప్లానింగ్ చేయకుండా.. భార్య భర్తల ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ లేకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. కలిసి నూరేళ్లు బతకాల్సిన వాళ్లు.. విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.