
చదువంటే మార్కులు తెచ్చుకోవడం కాదు. జీవితాన్ని నేర్చుకోవడం, పరీక్షలో ఫెయిలవడం సరిదిద్దుకోలేని తప్పిదం కాదు. అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఫెయిల్ అవుతారు. కానీ పరీక్షలో మార్కులే ప్రతిభకు, సామర్థ్యానికి కొలమానం కాదు. ఇదే అంతిమ పరీక్ష కూడా కాదు. జీవితంలో ఇంకా చాలా అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోతే వచ్చేది దుఃఖం, అవేశమే, ఇవి సాధిస్తామన్న ఆశను చంపేయకూడదు
పరిక్షల ఫలితాలొచ్చాయ్. మార్కులు చూసుకుని చాలామంది మురిసిపోతున్నారు. అట్లనే ఇంకొంతమంది మార్కులు రాలేదని కుమిలిపోతున్నారు. ఎట్లరాశారో.. పరీక్ష రోజే తెలుసు. కానీ ఫలితాలొచ్చాకే బాధపడతారెందుకు? 'ఈ బాధ అమ్మానాన్నల సృష్టి, భయపెట్టే వాళ్ల మాటలే పిల్లల మనసుల్ని గాయపరుస్తాయ్. ఈ భయం తీరని శోకం మిగిల్చే ప్రమాదముంది.
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల సమస్యను. తల్లిదండ్రులు సరిగా అర్థం చేసుకోరు. నిర్దేశించిన సమయంలో ఒక సబ్జెక్ట్ లోని అంశాలను సరిగా గుర్తు తెచ్చుకోకపోవడం వల్ల పిల్లలకు మార్కులు తక్కువ వస్తాయి. మూడు గంటల్లో రాసే పరీక్ష ప్రతిభకు కొలమానం కాదు. ఈ విషయాన్ని పిల్లల కన్నా తల్లితండ్రులే ఎక్కువగా అర్థం చేసుకోవాలి... ఎందుకు ఫెయిలయ్యారో పిల్లలకు తెలుసు. ఫలానా ప్రొఫెషనల్ కావాలనుకునే పిల్లలు... ఫలానా డిగ్రీ సాధించాలనే కోరిక ఉన్న పిల్లలు' ఎట్లయినా కష్టపడి సాధిస్తారు. ఫెయిలైతే తమ లోపాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. కానీ తల్లిదండ్రుల కోసం చదివే పిల్లలుంటారు. ఇప్పుడు చదివే పిల్లల్లో ఎక్కువ మంది తమ ఇష్టమైన అంశాన్ని చదవట్లేదు తల్లిదండ్రుల కొరకలు వేరే ఉంటాయి. ఆ కోరికలకు ఏ కోర్సులు చదవాలో ముందే పేరెంట్స్ డిసైడ్ చేస్తారు. దానికి తగిన కోర్సుని వాళ్లే సెలక్ట్ చేస్తున్నారు. కాలేజీని కూడా వాళ్ల ఎంపిక చేస్తున్నారు. అమ్మానాన్నలు అశలు తీరాలంటే వాళ్లు ఆశించిన స్థాయిలో మార్కులు సాధించాలి.
తప్పు ఇక్కడుంది..
పిల్లలఫెయిల్యూర్ ను పేరెంట్స్ అవమానంగా భావిస్తున్నారు. ఈ చిన్న విషయాలకే చిన్న బుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు తెలియక మనకున్న టెన్షన్ కూడా లేదు వాడికి! అని అమ్మ ఏడుస్తుంది. 'వాడెకేం తెలుసు మనం ఎంత కష్టపడి చదివించామో? ఎంత ఖర్చు. చేశామో?" అని నాన్న అరుపులు ఫెయిల్యూర్ పట్ల ఉదాసీనంగా ఉన్న పిల్లల్ని మరింత భయపడతాయి. విద్యార్థిలో.. 'నేను తప్పు చేశాను' అనే భావనను క్రియేట్ చేస్తాయి.
సున్నిత మనస్కులు ఆత్మహత్యకు పాల్పడటం.. ప్రయత్నించడం.. ఇల్లువదిలిపోవడం చేస్తారు. అంతేకాకుండా పేరెంట్స్ పట్ల వ్యతిరేక భావం ఏర్పడుతుంది. చేతికొచ్చిన పిల్లలు చేయిదాటి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు మర్చిపోవద్దు.
బెస్ట్ లెస్సన్
ఫెయిల్యూర్ జీవితాన్ని నేర్పిస్తుంది. జీవితంలో. ఫెయిల్యూర్ కూడా ముఖ్యమైన అవసరమే. జీవితం మనం అనుకున్నట్లుగా ఉండదు. మార్పులు సహజం. ప్రతికూలమైన సందర్భాలు ఎన్నో వస్తాయి. ఫెయిల్యూర్ అనుభవమైనప్పుడే మనం సమాజంలో ప్రతికూలతలో ఎలా ఉండగలం. నేర్చుకునే స్వభావం, స్పందించే గుణం తెలుస్తాయి. అందుకే ఫెయిల్యూర్ కూడా ఒక పాఠమే అందరికీ అవసరమే.
పేరెంట్స్ ఫెయిల్యూర్
పేరెంట్స్ వల్లనే ఎక్కువ మంది పిల్లలు ఫెయిలవుతున్నారు. సాధారణంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే ఆలోచన ఉన్నప్పుడు టెన్షన్ క్రియేట్ అవుతుంది. తల్లిదండ్రులు నిర్దేశించిప లక్ష్యాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్న పిల్లలు టెన్షన్ తో ఉంటారు. ఈ టెన్షన్ తో పరీక్షలు సరిగా రాయరు. అనుకున్న మార్కులు రాకపోతే అమ్మానాన్న తిడతారనే భయం ఉంటుంది. మంచి మార్కులతో మా కుటుంబ గౌరవం నిలబెట్టాలనే పేరెంట్స్ ఒత్తిడి పిల్లల్ని పల్టీ కొట్టిస్తుంది.
- అందరు తెలివి తేటలతోనే పుడతారు
- స్కూళ్లు, కాలేజీలు తెలివితేటలు నేర్పవు. పిల్లల్లో సహజంగా ఉండే తెలివిని నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలోనేర్పుతాయంతే.
- ప్రపంచం మార్కుల మీద సడవల్లేదు. సృజనాత్మకత, శ్రమతోనే ఏ రంగంలోనైనా రాణిస్తారు.
- పరీక్షల్లో ఫెయిలయినప్పుడు ఈసారి సాధించమని దైర్యం చెప్పాలి. ఏమీ కాదని చెప్పాలి.
- పిల్లల సమస్యను అర్థం చేసుకుని కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి.
- ఫెయిల్ అయినా మళ్లీ చదవొచ్చు, మళ్లీ పరీక్షలు రాసి సాధించవచ్చు
సిలబస్ లో ఉన్న ట్రాఫిక్ రూల్స్ చదివి, పరీక్షలో బాగా రాస్తే మార్కులొస్తాయి. వాటిని రోడ్డు మీద పాటించకపోతే యాక్సిడెంట్ అవుతుంది. మార్కులు చూస్తే వంద వస్తాయి. కానీ రోడ్డు మీద ఫెయిల్ అవుతారు. తెలుసుకున్న విషయాల్ని జీవితానికి అస్వయించకపోతే ఫెయిల్యూర్ కాదు. కానీ మార్కులు రాకపోతే జీవితం ఫెయిల్.. తల కిందుల లోకం ఇది..!