
ప్రధాని మోదీ రెండో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఆదివారం( మార్చి16) సాయంత్రం 5.30 గంటలకు విడుదలైంది. ప్రముఖ అమెరికా పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్ ప్రధాని మోదీతో దాదాపు మూడు గంటల ఇంటర్వ్యూ చేశారు. ఈ పాడ్కాస్ట్లో ప్రధాని చిన్ననాటి విశేషాలు, హిమాయాల్లో ఆయన జీవితం, రాజకీయ జీవితం గురించి చాలా ఆసక్తి కర విషయాలు పంచుకున్నారు. అయితే ప్రధాని మోదీతో చేసిన పాడ్కాస్ట్ గురించి పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రధాని మోదీతో పాడ్కాస్ట్ కు ముందు తాను 45 గంటల పాటు ఉపవాసం ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్మన్ చెప్పారు. ప్రధాని మోదీపై గౌరవసూచకంగా నీరు,ఆహారం తీసుకోలేదన్నారు లెక్స్ ఫ్రిడ్ మన్. స్థితమనస్తత్వం పొందేందుకు, ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవడానికి తాను ఉపవాసం ఉన్నట్లు తెలిపారు.
ఫ్రిడ్మన్ ఉపవాసంపై ప్రధాని మోదీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిస్టర్ ఫ్రిడ్మన్ ఉపవాసం ఉన్నారని తెలిసి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నాపట్ల గౌరవానికి నిదర్శనంగా ఉపవాసం ఉన్న ఫ్రిడ్మన్ న్కు ప్రధాని కృతజ్ణతలు తెలిపారు.
ALSO READ | PM Modis epic podcast: పీఎం మోదీ ఎపిక్ పాడ్కాస్ట్.. పవర్ ఫుల్ కన్వర్జేషన్..
ఉపవాసం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ప్రధాని మోదీ. తాను బరాక్ ఒబామా టైంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు తాను ఉపవాసం ఉన్నానని అన్నారు. వైట్ హౌజ్ వెళ్లి తాను ఏం తినకపోవడం ఒబామా ఆశ్చర్యపోయారని అన్నారు. రెండోసారి అమెరికి పర్యటనకు వెళ్లినప్పుడు ‘‘ఈసారైనా మాతో కలిసి భోజనం చేస్తారా ’’ అని ఒబామా గుర్తు పెట్టుకొని మరీ అడిగినట్టు మోదీ చెప్పారు.
ఉపవాస ప్రక్రియ క్రమశిక్షణ, మనసు లగ్నం చేసుకునేందుకు శక్తివంతమైన ఆయుధం అని మోదీ అన్నారు. జీవితంలో లోతైన మార్గాలను అన్వేసిస్తుందన్నారు. ఉపవాసం ఆలోచనా ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నారు. కొత్త ఆలోచనలు ఇస్తుందన్నారు ప్రధాని మోదీ.