మనీ లాండరింగ్ కేసులో మహేష్ బాబు ఏం చేయబోతున్నారు.. ED విచారణను తప్పించుకోలేరా..?

మనీ లాండరింగ్ కేసులో మహేష్ బాబు ఏం చేయబోతున్నారు.. ED విచారణను తప్పించుకోలేరా..?

హీరో మహేష్ బాబు.. మనీ లాండరింగ్ స్కాంలో ఇప్పుడు ఏం చేయబోతున్నారు.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈడీ విచారణ నుంచి తప్పించుకోలేరా.. కచ్చితంగా ఈడీ నోటీసులకు.. స్వయంగా విచారణకు హాజరు కావాల్సిందేనా.. ఈడీ ఆఫీసులో.. ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యి వివరణ ఇవ్వాల్సిందేనా.. ఇప్పుడు ఈ ప్రశ్నలు అందరికి ఆసక్తిగా మారాయి.. అసలు మహేష్ బాబు.. ఈ మనీలాండరింగ్ కేసుతో ఉన్న లింక్ ఏంటీ.. ఈడీ నోటీసుల వెనక ఏం జరిగింది అనేది వివరంగా తెలుసుకుందాం..

హీరో మహేష్ బాబు చాలా కంపెనీలకు ప్రమోటర్గా చేస్తున్నారు. అందులో సురానా గ్రూప్ కు చెందిన సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి. ఈ సాయిసూర్య డెవలపర్స్ చెందిన వెంచర్స్ ను ప్రమోట్ చేశారు హీరో మహేష్ బాబు.. 30 అంటే 30 సెకన్ల యాడ్.. దీని కోసం హీరో మహేష్ బాబు అక్షరాల 5 కోట్ల 90 లక్షల రూపాయలు ఛార్జ్ చేశారు. ఇందులో 3 కోట్ల 40 లక్షల రూపాయలను బ్యాంక్ చెక్కు ద్వారా తీసుకున్నారు. మిగతా 2 కోట్ల 50 లక్షల రూపాయలను నగదు రూపంలో తీసుకున్నారు.

ప్రకటనల రూపంలో హీరో మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోవటంలో తప్పు లేదుకానీ.. ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ ఆఫీసులు, ఇళ్లల్లో ఈడీ తనిఖీలు చేసినప్పుడు.. లెక్కల్లోకి రాని 100 కోట్ల రూపాయలను గుర్తించారు. ఈ డబ్బు అంతా హవాలా డబ్బు అని.. మనీలాండరింగ్ కింద గుర్తించింది ఈడీ. పన్నులు ఎగ్గొట్టటానికే సాయిసూర్య డెవలపర్స్ లెక్కల్లో 100 కోట్ల రూపాయలు చూపించలేదనే అంశంపై ఈడీ విచారణ చేస్తుంది. ఇందులో భాగంగానే.. ఆ 100 కోట్ల రూపాయల మనీలాండరింగ్ లోనే.. లెక్కల్లో చూపించని 100 కోట్ల రూపాయల నుంచే హీరో మహేష్ బాబుకు 2 కోట్ల 50 లక్షల రూపాయలను నగదు రూపంలో చెల్లించారా అనే అంశంపై క్లారిటీ కోసమే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక్కడ ఓ అంశం అనేది హీరో మహేష్ బాబు చెప్పాల్సి ఉంటుంది. నగదు రూపంలో తీసుకున్న రెండు కోట్ల 50 లక్షల రూపాయలను.. మహేష్ బాబు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ లో చూపించారా లేదా అనేది కూడా కీలక అంశంగా మారనుంది. ఈడీ నోటీసులపై.. హీరో మహేష్ బాబు ఇప్పుడు స్వయంగా హాజరు అవుతారా లేక తన లాయర్ ను పంపిస్తారా లేక కోర్టుకు వెళ్లి స్వయంగా హాజరు నుంచి మినహాయింపు కోరతారా అనేది వెయిట్ అండ్ సీ..