![మార్కెట్లో రక్తపాతం.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి..?](https://static.v6velugu.com/uploads/2025/02/why-market-is-falling-today-key-factors-that-fueled-the-crash-and-what-investors-to-do_UIbguzApiJ.jpg)
ఇండియన్ స్టాక్ మార్కెట్లు రక్తపాతాన్ని తలపిస్తున్నాయి. వరుసగా 5 రోజులుగా దారుణంగా ఫాల్ అవుతూ ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తు్న్నాయి. మంగళవారం (ఫిబ్రవరి11) బ్యాంక్, మెటల్, ఐటీ, ఆటో స్టా్క్స్ లో భారీ సెల్లింగ్ రావడంతో నిఫ్టీ, సెన్సెక్స్ భారీ నష్టాలను చవిచూశాయి. BSE Sensex 1018.2 పాయింట్లు నష్టపోయి 76293 దగ్గర ముగిసింది. ఇక ఫ్టీ 309 పాయింట్లకు పైగా నష్టపోయి కీలకమైన 23,000 సప్పోర్ట్ లెవల్ కిందికి వచ్చేసింది.
ఇవాళ్టి ట్రేడింగ్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లు దారుణంగా పడిపోయాయి. స్మాల్ క్యాప్ 3.9%, మిడ్ క్యాప్ 3.5% నష్టపోవడంతో పోర్ట్ ఫోలియోలు నష్టాలను చవిచూశాయి.
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9.87 (దాదాపు) 10 లక్షల కోట్లు పడిపోయి రూ.407.95 లక్షల కోట్లకు చేరుకుంది. HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Bank లు దాదాపు 3 శాతానికి పైగా పడిపోయి సెన్సెక్స్ ఫాల్ కు 270 పాయింట్లు కంట్రిబ్యూట్ చేశాయి.
మార్కెట్ ఫాల్ కు కారణాలు:
కొనసాగుతున్న ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు:
యూఎస్ టారిఫ్ హెచ్చరికలతో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. స్టీల్, అల్యూమినియం ఇంపోర్ట్స్ పై 25 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో సెల్ ఆఫ్ కొనసాగుతోంది. మార్చి 4 నుంచి కొత్త టారిఫ్ లు ( 25%) అమలవుతాయని వైట్ హౌస్ అధికారిక వర్గాల సమాచారం.
స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల SIPల పై ఆందోళనలు:
సోమవారం (ఫిబ్రవరి10) ఐసీఐసీఐ ప్రముఖ ఫండ్ మేనేజర్ ఎస్.నరేన్ చేసిన హెచ్చరికలతో స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్ లు ఘోరంగా పతనం అయ్యాయని చెప్పొచ్చు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టే కాస్త ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, 2008-10 లో వచ్చిన ఫాల్ తర్వాత అంత పెద్ద కఠిన పరిస్థితులు 2025లో స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల విషయంలో చూడవచ్చు అని ఆయన హెచ్చరించడం, SIP చేసేవాళ్లు కాస్త ఆలోచించడం మంచిదని చెప్పడంతో ఈ సెక్టార్లు ఘోరంగా ఫాల్ అవుతున్నాయి.
తగ్గని FII ల అమ్మకాలు:
ఫారెన్ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ల నుంచి వరుసగా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ ఏడాదిలో దాదాపు 86 వేల 314 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపారు. అంటే భారత మార్కెట్ నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి. దీంతో మార్కెట్లో సెల్ ఆఫ్ తగ్గడం లేదు.
Also Read :- అగ్గిపెట్టె సైజు గది.. అద్దె 25 వేలా..?
రూపాయి పతనం.. డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ పెరగడం:
బాండ్ ఈల్డ్స్ పెరగుతుండటంతో ఇండియాలో అమ్మి బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్స్ 4.495 శాతం పెరిగాయి. అదే విధంగా డాలర్ ఇండెక్స్ పెరగడంతో ఇండియాలో అమ్మకాలు పెరుగుతున్నాయి. డాలర్ ఇండెక్స్ 108.36 దగ్గర ట్రేడ్ అవుతోంది.
రూపాయి పడుతుండటంతో డాలర్, బాండ్స్ లో రిటర్న్స్ ఎక్కువగా ఉండటంతో పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరో విషయం ఏమిటంటే.. ఒకవైపు రూపాయి పతనంతో సరైన లాభాలు రాని పరిస్థితుల్లో.. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇండియాలో ఉండటం కూడా ఫారెన్ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణం అని చెప్పవచ్చు. ఈ ట్యాక్స్ లతో వచ్చిన లాభం డాలర్, బాండ్స్ తో పోల్చితే తక్కువగా ఉండటం గమనార్హం.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి:
మార్కెట్ బుల్ ఫేజ్ లో ఉన్నపుడు ఉత్సాహంగా పెట్టుబడి పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు.. భారీ పతనంతో కనీసం 20 నుంచి 40 శాతానికిపైగా నష్టాలు చవిచూస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చిన బుల్ మార్కెట్ లో ఎంటరైన ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు ఇలాంటి బిగ్ ఫాల్ ను చూసి ఉండరు. అందుకోసం భారీ నష్టాలను చూసి ఆందోళన చెందడం సహజం. అయితే పోర్ట్ ఫోలియోలు భారీ నష్టాల్లో ఉన్న సమయంలో అమ్మకాల వలన మరింత నష్టపోయే చాన్స్ ఉంది. మళ్లీ మార్కెట్ లో రివైవల్ స్టార్ అయ్యే వరకు వేచి చూడటం మంచిదని అనలిస్టుల సలహా. అదే విధంగా పడుతున్నాయి కదా.. యావరేజ్ చేద్దాం అనే ధోరణి కూడా సరైనది కాదు.
మార్కెట్లు రివర్సల్ స్టార్ట్ అయ్యే వరకు .. అదే విధంగా గ్లోబల్ గా ఉన్న అనిశ్చితి తగ్గే వరకు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా.. ప్రత్యామ్నాయంగా గోల్డ్, ఈటీఎఫ్, ఫిక్స్ డ్ డిపాజిట్లు మొదలైన వాటిలో కొంత మేరకు పెట్టుబడి పెట్టడం సేఫ్ అని అంటున్నారు. అదే విధంగా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే సేఫ్ సైడ్ ఆప్షన్ లార్జ్ క్యాప్స్ అని.. అది కూడా బల్క్ ఇన్వెస్ట్ మెంట్ కాకుండా స్లోగా అక్యుములేట్ చేయాలని చెబుతున్నారు. లాంగ్ టర్మ్ విజన్ ఉంటేనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ గురించి ఆలోచించాలని ఎనలిస్ట్ ల సూచన.