3 నెలలు దాటిన శిశువును దత్తత తీస్కుంటే తల్లికి మెటర్నటీ లీవ్​ వద్దా? : కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

3 నెలలు దాటిన శిశువును దత్తత తీస్కుంటే తల్లికి మెటర్నటీ లీవ్​ వద్దా? : కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మూడు నెలలలోపు వయసున్న శిశువును దత్తత తీసుకునే మహిళలకే ప్రసూతి సెలవు ఇవ్వడం వెనుక హేతుబద్ధత ఏమిటో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

మూడు నెలలలోపు వయసున్న శిశువును దత్తత తీసుకునే మహిళలకు మాత్రమే సెలవు మంజూరు చేసే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లోని అంశాలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. శిశవు వయసును 3 నెలలకే పరిమితం చేయడం సరి కాదని జస్టిస్  జేపీ పార్దివాలా, జస్టిస్ పంకజ్  మిట్టల్ బెంచ్  పేర్కొంది. ఈ కేసులో అఫిడవిట్  దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.