
పండుగ వచ్చిందంటే చాలు.. జనాలు కొత్త బట్టలు.. నగలు.. కొత్త అల్లుళ్లు.. అత్తగారింటికి వెళ్లడం..ఒకటేమిటి.. ఇలా ప్రతి పండుగకే ఏదో ఒక హడావిడి ఉంటుంది. కానిశివరాత్రి పండుగ రోజు కొత్త బట్టలు ...అంటే ఓ పంచ .. కండువాతో మాత్రమే సరిపెట్టుకుంటారు. ఇతర నగలు ఏమీ కొనరు.. దీనికి పురాణ ఓ పురాణ కథ కూడా ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. . .
శివరాత్రి వచ్చిందంటే చాలు.. దాదాపు హిందువులందరూ .. శివాలయాలకు వెళ్లి.. అభిషేకం చేయడం .. ఉపవాస దీక్ష.. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం లాంటివి చేస్తుంటారు. ప్రతి పండుగకు చేసే ఇతర హడావిడి.. శివరాత్రి పండుగకు మాత్రం పూజలు చేయడంలో నిమగ్నమై ఉంటారు. బంగారం లాంటి విలువైన వస్తువులు ధరించినా.. కొత్తగా అందంగా ఉండే బట్టలు కట్టుకున్నా,, ధ్యాస అంతా వాటిపైనే ఉంటుంది. భక్తిపై ఉండదు. దీంతో ఉన్న ఇబ్బందులు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు శివరాత్రి రోజు కొత్తగా బంగారం కొంటే ఆకలితో అలమిస్తారని శాపం కూడా ఉంది.
పండిత పుత్ర పరమ సుంఠ అనే సామెత ప్రకారంగా..గుణనిధి చదువునందు ఆశ్రద్ద చూపి అల్లరి చిల్లరగా తిరుగుతూ.. చెడు వ్యసనాలకు బానిసయి.. దొంగతనాలు చేస్తూ.. .జూదం ఆడుతూ కాలక్షేపం చేసేవాడు. శివరాత్రి పర్వదినాన ఇంట్లో బంగారపు దొంగతనం చేసి.. దానిని కల్లు అమ్మే వాడికి ఇచ్చి మద్యం.. తాగి.. మాంసం తిని ఒళ్లు తెలియని పరిస్థితిలో ఉన్నాడు. బంగారం వలన శివరాత్రి వలన దుష్టకార్యానికి పాల్పడ్డాడని.. ఈ విషయాన్ని దివ్య దృష్టితో గ్రహించిన బ్రాహ్మణుడు.. శివరాత్రి రోజున ఎవరు కొత్తగా బంగారం కొనకూడదని .. పూజకు అవసరమైనవి తప్ప ఏ ఇతర వస్తువులను కొత్తగా కొనకూడదని శాపం ఇచ్చాడు. అందుకే శివరాత్రి రోజున బంగారం లాంటి వస్తువులు కొనకూడదని పురాణాలు చెబుతున్నాయి.
ఆ తరువాత గుణనిధికి ఇంటికి రావడానికి ధైర్యం చాలలేదు. ఏమిచేయాలో దిక్కుతోచక అటూయిటూ తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆకలి బాధ అతడిని దహించసాగింది. అదే సమయంలో ఒక శివ భక్తుడు వివిధ పక్వాన్నములను తీసుకొని తన పరివారం, మిత్రులతో కలిసి శివాలయానికి వెడుతున్నాడు. పక్వాన్నముల సువాసనలు గుణనిధి ఆకలిని అధికం చేశాయి.
ఆలయ ద్వారం దగ్గరే ఉన్న గుణనిధి శివుడి నివేదనను ఆరగించాలన్న ఆరాటంతో గుడిలోకి ప్రవేశించాడు.ఆ తొందరలో నిద్రిస్తున్న ఒకరికి గుణనిధి కాలు తగిలింది. వాడు మేల్కొని గుణనిధిని చూచి దొంగ.. దొంగ అని అరవసాగాడు. ఆ అరుపులకు భయపడి పారిపోతున్న సమయంలో గుణనిధి కాళ్లు తడబడి గర్భగుడి వెలుపలనున్న నందీశ్వరుని మీద పడ్డాడు. పడటం తోనే అతని తల పగిలి ప్రాణాలు పోయాయి.