టన్నెల్‌‌ కాదని పైప్​లైన్లు ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం

టన్నెల్‌‌ కాదని పైప్​లైన్లు ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం
  • కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీపై వివరణ ఇవ్వాలన్న కేంద్రం

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీ పనులపై కేంద్రం మళ్లీ ఆరా తీసింది. తక్కువ ఖర్చుతో వందేళ్లు పనిచేసే టన్నెల్‌‌, గ్రావిటీ కాల్వలను కాదని తక్కువ లైఫ్‌‌ ఇచ్చే పైప్​లైన్లు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ ఇంజనీర్స్‌‌ ఫోరం కన్వీనర్‌‌ దొంతుల లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్‌‌ వీరేశ్‌‌.. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. మేడిగడ్డ నుంచి ఇప్పటికే రెండు టీఎంసీలను తరలించేందుకు టన్నెళ్లు, గ్రావిటీ కెనాళ్లు తవ్వారని, అడిషనల్‌‌ టీఎంసీకి మాత్రం పైప్​లైన్లు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో క్లారిటీ ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ఇంజనీర్స్‌‌ ఫోరం ఫిర్యాదుపై నిర్దిష్టమైన చర్యలు చేపట్టి, ఆ సమాచారాన్ని తమకు తెలియజేయాలని ఆదేశించారు.

ఎకరం నీళ్లిచ్చేందుకు రూ.25 వేల కరెంట్‌‌ బిల్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రారంభించిన ‘డాక్టర్‌‌ బీఆర్‌‌ అంబేద్కర్‌‌ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి’ ప్రాజెక్టును తెలంగాణ ఏర్పడ్డాక కాళేశ్వరం పేరుతో రీ డిజైన్‌‌ చేశారని దొంతుల లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి నుంచి ఏటా 160 టీఎంసీలను తరలించాల్సి ఉండగా, కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి 195 టీఎంసీలు ఎత్తిపోయాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రూ.7,849 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రాణహితలో నీళ్ల ఎత్తిపోతలకు 3,300 మెగావాట్ల కరెంట్‌‌ అవసరముండగా.. కాళేశ్వరంలో ఎత్తిపోతలకు 4,600 మెగావాట్లు అవసరమని తెలిపారు. ప్రాణహితలో ఒక్క ఎకరాకు సాగు నీళ్లిచ్చేందుకు కరెంట్‌‌ బిల్లు రూ.12,520 కాగా, కాళేశ్వరంతో అది రూ.25,018కి పెరిగిందని తెలిపారు.

ఈసారైనా సమాచారమిచ్చేనా?

కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీ పనులపై కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ, గోదావరి రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్లు రాశాయి. అడిషనల్‌‌ టీఎంసీ డీపీఆర్‌‌తో పాటు ఈ ప్రాజెక్టుతో అదనంగా సాగులోకి వచ్చే ఆయకట్టు, స్టెబిలైజ్‌‌ చేసే పాత ఆయకట్టు వివరాలు జిల్లాల వారీగా ఇవ్వాలని ఆదేశించాయి. ప్రాజెక్టు ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌, కాస్ట్‌‌ అప్రూవల్‌‌ సహా ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని కోరాయి. కానీ ఏ ఒక్క లెటర్‌‌కూ రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో కేంద్రం రాసిన తాజా లెటర్​పైనైనా సర్కారు స్పందించి సమాచారం ఇస్తుందా లేదా అనే చర్చ ఇరిగేషన్‌‌ వర్గాల్లో నడుస్తోంది.

రూ.8 వేల కోట్ల అదనపు ఖర్చు

ఎల్లంపల్లి నుంచి మిడ్‌‌ మానేరుకు థర్డ్‌‌ టీఎంసీ, మిడ్‌‌ మానేరు నుంచి మల్లన్న సాగర్‌‌కు సెకండ్‌‌ టీఎంసీ నీటిని తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం కరోనా టైంలో రూ.21,458 కోట్లతో ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పిలిచిందని దొంతుల లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అండర్‌‌ గ్రౌండ్‌‌ టన్నెల్‌‌, గ్రావిటీ కాలువలను కాదని పైపులైన్లతో నీళ్లు తరలించడం వల్ల రూ.8 వేల కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ఎనిమిది ప్యాకేజీల పనులు టన్నెల్‌‌, కాలువలతో చేపడితే రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చయ్యేదని, పైప్​లైన్ల వల్ల నిర్మాణ వ్యయం రూ.25 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. కాల్వలు, టన్నెల్‌‌కు వెయ్యి ఎకరాల భూమిని సేకరిస్తే సరిపోయేదని, ఇప్పుడు 3 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కిలోమీటర్‌‌ టన్నెల్‌‌, కాల్వల తవ్వకానికి రూ.80 కోట్లు ఖర్చయితే.. పైప్​లైన్లకు రూ.280 కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. పైప్​లైన్లతో లీకేజీ సమస్య ఎక్కువగా ఉంటుందని, రిపేర్లు, నిర్వహణ వ్యయం  పెనుభారవుతుందని తెలిపారు. టన్నెళ్లు, గ్రావిటీ కాలువలు వందేళ్ల పాటు పని చేస్తే పైప్​లైన్‌‌ లైఫ్‌‌ 20 నుంచి 25 ఏళ్లు మాత్రమేనని తెలిపారు.

For More News..

నా కొడుకు, కోడలు హత్య  వెనుక పుట్ట మధు ఉన్నడు

కరోనా మళ్లీ వస్తోంది.. వదిలేస్తే సెకండ్​వేవ్​