సామ్యవాద, లౌకిక పదాలు తొలగించడం ఎందుకు?

సామ్యవాద, లౌకిక పదాలు తొలగించడం ఎందుకు?

భా రత రాజ్యాంగానికి పీఠిక ఆత్మ వంటిది. ఇటీవల రాజ్యాంగ పీఠిక అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. 1976లో  42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సామ్యవాద, లౌకిక పదాలను చేర్చగా... వాటిని సవాల్ చేస్తూ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్, బలరామ్ సింగ్  పిటిషన్లు  దాఖలు చేశారు. 

వీటిపై  సీజేఐ  నేతృత్వంలోని బెంచ్ తీర్పునిస్తూ...పీఠిక రాజ్యాంగంలో భాగమే కాబట్టి, దాన్ని సవరించే అధికారం కూడా పార్లమెంట్​కు ఉంటుంది. కానీ,  సామ్యవాదం, లౌకిక పదాలను తొలగించవద్దని పేర్కొన్నది. ఈ తీర్పు చెబుతూనే పిటిషనర్లను  సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించడం జరిగింది. 1949 నవంబర్ 26 రాజ్యాంగ పీఠికను ఆమోదించారు. ఇన్ని ఏండ్ల తర్వాత ఈ సమస్యను లేవనెత్తాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించింది.

దీనిపై విచారణ అక్కర్లేదని కూడా తెలిపింది. కాగా, సామ్యవాదం, లౌకికం అనేవి రాజ్యాంగంలో అంతర్భాగం. ఈ పదాలకు వివరణలు ఉన్నాయి.  కొందరు వేర్వేరుగా అన్వయించుకుంటున్నారు.   అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే సామ్యవాదం.  లౌకిక అనే పదం కూడా అంతే.  అనగా మత ప్రమేయం లేని రాజ్యం. అయితే, గతంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ...1975 ఎమర్జెన్సీ కాలంలో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  చేసిన సవరణలన్నీ తప్పులని చెప్పలేమని పేర్కొంది.

సంక్షేమ రాజ్యానికి మూలం సామ్యవాదం  

రాజ్యాంగం ఆమోదించే నాటికి పీఠికలో  సార్వభౌమ, ప్రజాస్వామ్య,  గణతంత్ర అనే పదాలు ఉండేవి.  1976లో  ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ  రాజ్యాంగ సవరణ ద్వారా 'సౌమ్యవాద,  లౌకిక,  సమగ్రత' అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చినారు. భారత రాజ్యాంగంపైన  అంబేద్కర్,  నెహ్రూ  ప్రభావం  అధికంగా ఉన్నది.  స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులకు కూడా చేరాలంటే  మన దేశం సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది నెహ్రూ  ఆలోచన.  దీనికనుగుణంగా  రాజ్యాంగంలో  సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించిన అంశాలను చేర్చినారు.  భారతదేశం  ప్రజా స్వామ్య సామ్యవాదాన్ని అనుసరిస్తోంది. 

సామ్యవాదం  అనగా  సమానత్వంను సాధించుట. దీన్ని సమసమాజ స్థాపనగా భావిస్తారు. ఇది సంక్షేమం స్వభావంతో  కూడుకొని ఉన్నది. కామన్ కాజ్ వర్సెస్​ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు  తీర్పునిస్తూ దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా, ప్రైవేటీకరణ జరిగినప్పటికీ  సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.  దేశ అభివృద్ధి కోసం ఆర్థిక సంస్కరణలు అవసరమే కానీ అదే సందర్భంలో ఆర్ధిక సంస్కరణల ఫలితాలు సామాన్య ప్రజలకు అందేవరకు సామ్యవాదం అనే పదం రాజ్యాంగ ప్రవేశికలో కొనసాగుతుందని తీర్పునిచ్చింది. అనగా సామ్యవాదం ప్రాధాన్యతను స్పష్టం చేసింది.

అన్ని మతాల పట్ల సమాన దృక్పథం

ఆధునిక  రాజ్యాలన్నీ  లౌకిక రాజ్యాలే.   ప్రపంచవ్యాప్తంగా  సామాజిక,  సాంస్కృతిక  జీవన విధానంలో  సంభవించిన మార్పుల కారణంగా మతపరమైన రాజ్యాల భావనకు ప్రాధాన్యత తగ్గినది. లౌకిక రాజ్య భావన విస్తృతంగా ప్రాముఖ్యతను పొందినది. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించారు. లౌకిక రాజ్యం అనగా రాజ్యానికి అధికారికంగా  మతమంటూ ఉండదు.

ప్రభుత్వంలో, పరిపాలనలో  మత ప్రాధాన్యత ఉండదు.  రాజ్యం అన్ని మతాల పట్ల సమాన దృక్పథం  కలిగి ఉంటుంది.  ఏ మతానికీ ప్రత్యేక ఆదరణ ఉండదు. అదేవిధంగా ఏ మతం పట్ల వివక్షత కూడా చూపదు.  ప్రతి పౌరునికి మత స్వేచ్ఛ కల్పించడమైంది.  రాజ్యాంగంలోని  ప్రాథమిక హక్కులలో  లౌకిక లక్షణాలున్నాయి.  ఎస్​ఆర్​ బొమ్మై  వర్సెస్​ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు 1994లో  తీర్పునిస్తూ లౌకిక స్వభావం మన రాజ్యాంగ మౌలిక 
స్వరూపంలో  అంతర్భాగమని  తీర్పునిచ్చింది . 

అందువలన  లౌకిక రాజ్య  పరిరక్షణకు  ప్రభుత్వాలన్ని కట్టుబడి పనిచేయాలని సుప్రీంకోర్టు  తన తీర్పులో  పేర్కొన్నది. 
1947లో  మనదేశం స్వాతంత్ర్యాన్ని పొందే  సందర్భంలో  భారత్,  పాకిస్తాన్​గా  విభజించడం జరిగింది.  పాకిస్తాన్  తన రాజ్యాంగాన్ని మత ప్రాతిపదికపైన రూపొందించుకున్నది.  ఇప్పుడు ఆ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అదే  భారతదేశం  మాత్రం లౌకిక విధానాన్ని నేటికీ అనుసరిస్తున్నది.

అనగా మనదేశంలో  ప్రభుత్వపరంగా  అధికార మతం ఏదీలేదు.  ప్రతి పౌరునికి  తనకు ఇష్టమైన మతాన్ని అనుసరించే  మత స్వేచ్ఛను కల్పించడం జరిగింది. లౌకిక భావాలను తొలగించాలనడం  భారతదేశాన్ని  మతం పేరిట విడగొట్టడమే అవుతుంది.  భారతదేశంలో  మెజార్టీ హిందువులు ఉన్నప్పటికీ... మైనార్టీలుగా ముస్లింలు, క్రిస్టియన్లు,  బౌద్ధులు,  సిక్కులు,  జైనులు, పార్శీలు ఉన్నారు అనేది గుర్తించాలి. 

రాజ్యాంగానికి దిక్సూచిగా ప్రవేశిక

మనదేశ  సామాజిక, ఆర్థిక, రాజకీయ,  సాంస్కృతిక  పునాది  పీఠిక.  భవిష్యత్తులో  మన రాజ్యాంగం సాధించవలసిన ఆశయాలను రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగ పీఠికయందు  పొందుపరచడం  జరిగినది. గాంధీ ఆలోచన ప్రకారం ‘ఒక సామాన్య పౌరుడు కూడా ఇది నా భారతదేశం అని సగర్వంగా తలెత్తుకొని  ప్రకటించగలిగిన రోజున ఈ దేశం నిజమైన స్వాతంత్ర్యాన్ని సాధించినట్టు’ అని భావించాడు. ఈ అంశాన్ని దృష్టిలో  ఉంచుకొని  రాజ్యాంగ నిర్మాతలు మన  రాజ్యాంగానికి  దిక్సూచిగా రాజ్యాంగ  ప్రవేశికను రూపొందించారు. కాబట్టి,  పీఠికలో ప్రధానమైన పదాలు తొలగించవద్దు

చట్టాలకు స్పష్టతను ఇవ్వడానికి, అదేవిధంగా చట్టాలలోని అస్పష్టతను తొలగించడానికి  రాజ్యాంగ  ప్రవేశికను వినియోగించినప్పటికీ వాస్తవంలో మాత్రం రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలు, ఆశయాలు, ఆదర్శాలు, నమ్మకాలు. అదేవిధంగా  వారు కన్న కలలు మొదలైనవాటికి  ప్రతిరూపంగా  రాజ్యాంగ ప్రవేశిక నిలుస్తోంది.  రాజ్యాంగ  ప్రవేశిక అనేది  రాజ్యాంగ  స్ఫూర్తికి ఆధారం.  అధికారానికి  మాత్రం ఆధారం కాదు.

ఈ క్రమంలో ప్రభుత్వాలు తమ స్వార్థానికి రాజ్యాంగ మౌలిక అంశాలను దెబ్బతీయకూడదు.   రాజ్యాంగం ఔన్నత్యాన్ని  కొలిచే సాధనంగా రాజ్యాంగ ప్రవేశికను పరిగణించాలి. కావున,  పీఠికలో అంశాలను సాధించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి.  రాజ్యాంగ  ప్రవేశికలో  పేర్కొన్న ముఖ్యమైన  పదాలను సవరించాలనడం  రాజ్యాంగ  నిర్మాతలను అవమానించడమే అవుతుంది. 

- సంపతి రమేష్ మహారాజ్,
సోషల్​ ఎనలిస్ట్​