పుట్టినరోజు మార్చుకున్న రిషబ్ పంత్.. కారణమిదే?

పుట్టినరోజు మార్చుకున్న రిషబ్ పంత్.. కారణమిదే?

టీమిండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన డేట్ ఆఫ్ బర్త్‌ మార్చుకున్నాడు. సోషల్ మీడియా ఖాతాల్లోని తన బయో డేటాలో సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ '05-01-2023' అని ప్రకటించుకున్నాడు. పంత్ ఇలా చేయడం వెనుక ఓ బలమైన కారణమే ఉంది.

గతేడాది చివరి రోజున రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొత్త ఏడాది రోజు తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బీఎండబ్ల్యూ కారులో ఇంటికి బయలు దేరిన పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న కారు.. డివైడర్‌ను వేగంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పంత్‌.. కారు నుంచి  కిందికి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ఘటనలో అతడు ప్రాణాలతో బయటపడటమే భారత క్రికెట్ అభిమానులకు కాసింత ఊపిరి పోసింది.

ప్రాణాపాయం లేదని చెప్పిన రోజే.. రెండో బర్త్‌డే డేట్‌

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పంత్‌కు స్థానికంగా చికిత్స అందించారు. అనంతరం బీసీసీఐ చొరవ తీసుకుని.. అతనిని ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయి అంబాని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచింది. అక్కడి వైద్యులు పరీక్షించాక.. ప్రాణాపాయం లేదని తెలిపిన తేదీనే పంత్ తన రెండో బర్త్‌డే డేట్‌గా ప్రకటించుకున్నాడు. నిజానికి పంత్ పుట్టినరోజు అక్టోబర్ 4, 1997.

Rishabh Pant has changed his bio on Instagram ? @RishabhPant17

2nd Date of birth on 5th January 2023. #RishabhPant

Thank you very much to those who saved Rishabh Pant that day? pic.twitter.com/PnRT7ajrne

— Cult 18 (@vk_Cult03) June 28, 2023

రోడ్డు ప్రమాద గాయాల నుంచి పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. వరల్డ్ కప్ నాటికి అతను కోలుకున్న.. జట్టులోకి వచ్చేది అనుమానమే. మునుపటిలా రాణించడం పక్కనపెడితే.. మొదట ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాలి. ఒక వేళ అవన్నీ లేకండా అతన్ని నేరుగా జట్టులోకి తీసుకుంటే తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది.