బెంగాల్ లేకుంటే దేశానికి స్వాతంత్రమే వచ్చేది కాదు

బెంగాల్ లేకుంటే దేశానికి స్వాతంత్రమే వచ్చేది కాదన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ విషయంలో తాను ఎంతో గర్వపడుతున్నానన్నారు. పశ్చిమ బెంగాల్  కోల్ కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ  జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతాజీపై ఆమె మాట్లాడారు. ఇంత వరకు నేతాజీ ఆచూకీ తెలియలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ విషయంలో కృషి చేస్తామని చెప్పినా.. ఇంతవరకు ఏమీ జరగలేదన్నారు. నేతాజీకి సంబంధించిన అన్ని రకాల పైళ్లను తమ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కేంద్రానికి బెంగాల్ అంటే ఎందుకంత అలర్జీ అంటూ ప్రశ్నించారు మమత. రిపబ్లిక్ డే వేడుకల కోసం బెంగాల్ తయారు చేసిన శకటాన్ని తిరస్కరించారని ఆరోపించారు. బెంగాల్ ఒత్తిడి తెచ్చినందుకే.. నేతాజీ విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేస్తున్నారన్నారు. 
 

ఇవి కూడా చదవండి: 

ప్రియాంక వ్యాఖ్యలపై మాయావతి కౌంటర్ 

త్వరలో ఢిల్లీ హెల్త్ మినిస్టర్ అరెస్ట్