పొద్దున లేచినప్పటి నుంచి..సాయంత్రం వరకు మనం లెక్కలేనన్ని సార్లు టీ తాగుతుంటాం. ఇంట్లో అయితే..పొద్దున పెట్టుకున్న చాయ్ను..సాయంత్రం వరకు వేడి చేసుకుంటూ తాగుతాం. ఇలా టీ చల్లారిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం ఆరోగ్యనికి హానికరం. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నాలుగు ఐదు గంటల ముందు వేడి చేసిన టీని మళ్లీ వేడి చేసి తాగితే..మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ టీ మొదట్లో ఉన్న రుచికరంగా ఉన్నా ...ఆ తరువాత అలాంటి రుచి ఉండదు. టీని పలుమార్లు వేడి చేయడం వల్ల అందులోని పోషకాలన్నీ చనిపోతాయి. చల్లని టీ బ్యాక్టీరియాను సృష్టిస్తుంది. చాయ్ ను ఎంత ఎక్కువసేపు నిల్వ ఉంచితే.. అంత బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా డేంజర్.
పాలతో తయారు చేసే టీలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. వేడి చేసిన ప్రతిసారీ ఆ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వేడి చేసిన తరువాత మళ్లీ చల్లగా అయ్యే వరకు ఉంచి అస్సలు తాగొద్దు. అవసరం అయితే 15 నిమిషాల తరువాత ఒకసారి మాత్రమే వేడి చేయొచ్చు. కానీ నాలుగైదు గంటల తరువాత వేడి చేసి తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చల్లటి టీ తాగడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, అతిసారం, తిమ్మిరి, ఉబ్బరం, వికారం అలాగే పెద్ద జీర్ణ సమస్యలు సంభవించవచ్చు. ఎక్కువసేపు నిల్వ ఉంచిన టీ చాలా టానిన్‌ను విడుదల చేస్తుంది. ఇది చివరికి చేదు రుచిని సృష్టిస్తుంది.