ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు పది పీఆర్సీలు అమలయ్యాయి. వీటన్నింటిలోనూ ఎక్కువ ఆలస్యం జరిగినది 9వ పీఆర్సీనే. ఆ పీఆర్సీ కమిటీ నివేదిక రావడం, అమలు చేయడం పూర్తవడానికి 18 నెలల సమయం పట్టింది. కానీ ఆ రికార్డును కేసీఆర్ సర్కారు తిరగరాస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అమలులోకి రావాల్సి ఉన్న 11వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసే ఇప్పటికి 30 నెలలు పూర్తయింది. దీని వల్ల ఉద్యోగులకు నెలల తరబడి ఆర్థికంగా ఎంతో నష్టం జరుగుతోంది. అయితే రేపో మాపో కమిటీ రిపోర్టు వస్తే గడిచిన 30 నెలలకు సంబంధించిన ప్రయోజనాన్ని కూడా ఉద్యోగులకు అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
సర్వీస్ రూల్స్ లో జోక్యం వద్దు
పీఆర్సీ కమిటీనే ఉద్యోగుల సర్వీసు రూల్స్ రూపొందించాలని ప్రభుత్వం సూచించడం సరైన నిర్ణయం కాదు. ఆ కమిటీ సర్వీసు రూల్స్ విషయంలో జోక్యం చేసుకోకుండా కేవలం పీఆర్సీపై మాత్రమే రిపోర్ట్ ఇచ్చేలా పరిమితం చేయాలి. సర్వీస్ రూల్స్ పై ప్రత్యేకంగా కమిటీ ద్వారా నిబంధనలను రూపొందించేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే పీఆర్సీ కమిటీ నివేదిక రావడానికి మరింత ఆలస్యం అయ్యే చాన్స్ ఉంది. దీని వల్ల ఉద్యోగులు మరింత నష్టపోతారని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
ప్రమోషన్ల జాప్యంతో తీరని నష్టం
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీచర్ల సర్వీస్ రూల్స్ రూపకల్పనపై మూడు వేర్వేరు సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. కానీ టీఆర్ఎస్ సర్కారు ఏర్పడి ఆరున్నరేండ్లు గడుస్తున్నా నేటికీ ఆ పని చేయలేకపోయారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం వల్ల రాష్ట్ర పతి ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో, మళ్లీ దీనిపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల రాష్ట్రంలోని 1.5 లక్షల మంది టీచర్లు ఎలాంటి ప్రమోషన్లు లేక ఏళ్ల తరబడి ఒకే స్థానంలో ఉండిపోతున్నారు. ఉద్యోగం వచ్చిన సమయంలో ఉన్న అదే హోదాలో రిటైర్ అవుతున్న వారి బాధ మాటల్లో చెప్పలేనిది. ప్రతి నెలా సుమారు 1500 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. వీరంతా పొజిషన్ తోపాటు, ఆర్థిక పరంగా కూడా ఎన్నో బెనిఫిట్స్ కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని త్వరగా టీచర్ల సర్వీస్ రూల్స్ రూపొందించి, ప్రమోషన్లు ఇవ్వాలి.
పెన్షనర్ల బాధలు పట్టించుకోవాలె
పదో పీఆర్సీ కమిషన్ తన నివేదికలో 70 ఏండ్లు నిండిన పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 15 శాతం పెంచాలని సూచించింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెన్షనర్లకు తెలంగాణ ఇన్సెంటివ్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఈ రెండూ అమలు చేయకపోవడం బాధాకరం. అనారోగ్య సమస్యలతో బాధపడే పెన్షనర్లకు ఆ హామీల అమలుతో వచ్చే సొమ్ము ద్వారా మంచి వైద్యం చేయించుకునేందుకు వీలు కలుగుతుంది. పైగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత హెల్త్ కార్డుల ద్వారా సరైన చికిత్సలు అందకపోవడం వారికి మరో శాపంలా మారింది. హెల్త్ కార్డుల కోసం పెన్షనర్లు నెల నెలా కొంత మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కనీసం 11వ పీఆర్సీని అమలులోకి తెస్తే పెన్షనర్లకు ఆర్థికంగా వచ్చే లబ్ధి ద్వారా వారి విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడిచేలా ప్రభుత్వం సాయం చేయొచ్చని సీఎం కేసీఆర్ ఆలోచించాలి.
సీపీఎస్ రద్దుపై నిర్ణయం ఎప్పుడు?
రాష్ట్రంలో ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఎంప్లాయీస్ జీతాల నుంచి నెల నెల కొంత మొత్తాన్ని షేర్ మార్కెట్
లో పెడుతోంది. ఆ ఉద్యోగులు రిటైర్ అయ్యే నాటికి ఆ షేర్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.. గాలిలో దీపం లాంటి షేర్ మార్కెట్ కు ఉద్యోగుల పెన్షన్ తో లింక్ పెట్టడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత వారి జీవితానికి భరోసా లేకుండా చేయడమే. దీంతో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దుపై కమిటీ వేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ హామీ అమలు కాలేదు. దీనికి మోక్షమెప్పటికో అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ఉద్యోగులను కలవరపెడుతోంది.
సమస్యలు పరిష్కరించాలె
గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సమస్యలు వచ్చినప్పుడు ఆయా సంఘాల నాయకులు సీఎం లేదా సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి పరిష్కరించుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. వాటిపై పాలకులు పట్టీపట్టనట్లు వ్యవహరించిన సందర్భంలో పోరాటాల ద్వారా సాధించుకున్న అనుభవం ఉంది. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు పూర్తి భిన్నంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. సమస్యలపై ఒకటి రెండు సార్లు చర్చించినా వాటికి పరిష్కారం చూపలేదు. నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఉద్యమాలు చేయబోతే నిర్బంధాలు తప్ప.. కనీసం నిరసన తెలిపే అవకాశం ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు పీఆర్సీ నివేదిక వచ్చే ముందు రోజే సీఎస్, మరో ఇద్దరి కమిటీ వేస్తున్నామని, కొత్త సంవత్సరంలో లక్షలాది మందికి జీతాల పెంపు అని ప్రకటించడం చిత్రంగా ఉంది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడైనా చెప్పిన మాట ప్రకారం జీతాల పెంపుతో పాటు ఉద్యోగుల, టీచర్ల ఇతర సమస్యలను కూడా వేగంగా పరిష్కరించాలి.
– బి.మోహన్ రెడ్డి, చైర్మన్, బీజేపీ రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగుల సెల్
For More News..
సాగర్ టీఆర్ఎస్లో లోకల్-నాన్‌లోకల్ రగడ
న్యూఇయర్ పార్టీలతో కరోనా!
2020ని మర్చిపోవాలె.. వీళ్లను మాత్రం యాదికుంచుకోవాలె..
కలెక్టర్ పేరుతో తెలంగాణలో ఊరు! ఎందుకు పెట్టారో తెలుసా?
జీతాలు పెంచడానికి కమిటీ ఎందుకు?
- వెలుగు ఓపెన్ పేజ్
- December 31, 2020
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?