
ఒకవైపు టారిఫ్ లు.. ఎక్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటూ నానా హంగామా చేస్తున్న యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ తాజాగా మరో నిర్ణయంతో సంచలనం సృష్టించారు. ఇప్పుడు అమెరికా అంతా అదే అంశంపై చర్చ జరుగుతోంది. అమెరికా సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్ గా 13 ఏళ్ల బాలుడుని నియమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మంగళవారం (మార్చి4) యూఎస్ కాంగ్రెస్ డీజే.. డీజే నినాదాలతో మారుమోగింది. దీనికి కారణం డీజే డేనియల్ అనే 13 ఏళ్ల బుడ్డోడిని యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్ గా నియమించడమే. డేనియల్ కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందని, 5 నెలలు మాత్రమే బతికే చాన్స్ ఉన్నందున ఆ చిన్నారి కోర్కె తీర్చడం కోసం ఏజెంట్ గా నియమించినట్లు ప్రకటించడంతో హాల్ అంతా చప్పట్లతో, డేజే డీజే అంటూ మారుమోగిపోయింది.
ALSO READ : ఉక్రెయిన్‌కు యూఎస్ మిలిటరీ సాయం కట్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం
యూఎస్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ మొదటి స్పీచ్ లోనే.. డీజేను యూఎస్ సీక్రెట్ ఏజెంట్ గా అధికారికంగా నియమించాలని సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్ సీన్ కరాన్ కోరారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు డీజేను నియమించడం విశేషం.