పుల్కాలు తింటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్

పుల్కాలు తింటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్

పుల్కాల గురించి వినే ఉంటారు. నార్త్ ఇండియాలో ఇవి చాలా ఫేమస్. దక్షిణాదిన కూడా పుల్కాలను చాలా మంది ఇష్టంగా తింటారు. పుల్కా అంటే అదేదో వెరైటీ డిష్ అనుకోకండి. ఇది చపాతీనే. కానీ చపాతీ లాగే ఉన్నా దీంట్లో కొంత తేడా ఉంటుంది. పెనం మీద చేసిన చపాతీలను తీసుకొని.. పొయ్యి పై లేదా ప్రత్యేక స్టాండ్‌‌ మీద పొంగు వచ్చే వరకు కాల్చితే సరిపోతుంది. నిమిషాల్లో నోరూరించే పుల్కా రెడీ. వీటిని పప్పు, ఆకుకూరలతో తింటే భలే టేస్టీగా ఉంటాయి. పుల్కాలను తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. రండి..

పుల్కాలో కేలొరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి, తక్కువ కేలొరీలతో కూడిన భోజనం తినాలనుకునే వారికి పుల్కా సరైన ఫుడ్‌‌గా చెప్పొచ్చు.

షుగర్ పేషెంట్లకు పుల్కా మంచి భోజనం. వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్‌‌ స్థిరంగా ఉంటాయి.

పుల్కాను తయారు చేయడంలో వాడే గోధుమ పిండిలో విటమిన్ బీ1 ఉంటుంది. ఈ విటమిన్ శరీరానికి హాని కలిగించే కొన్ని రకాల కణాలను బయటకు పంపడంలో పోరాడుతుంది.

తక్కువ మోతాదులో నూనెను వాడి పుల్కాను తయారు చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ నూనెతో సుమారుగా 6 పుల్కాలను చేసుకోవచ్చు. ఆయిల్ వాడకుండా కూడా ఫుల్కాలను తయారు చేసుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునే వాళ్లు, గుండె నొప్పి, డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు, హెల్తీ లైఫ్ స్టయిల్‌‌ను పాటించాలనుకునే వాళ్లకు పుల్కా సరైన మీల్‌‌ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.