పాస్​వర్డ్​ సేవ్​ చేస్తున్నారా?

పాస్​వర్డ్​ సేవ్​ చేస్తున్నారా?

జీమెయిల్​, ఫేస్​బుక్​ లేదా ఇతర వెబ్​సైట్లలో లాగిన్​ అయ్యేముందు ‘పాస్​వర్డ్​ సేవ్​చేయమంటరా?’ ‘వద్దా?’ అని అడుగుతుంటాయి వెబ్​బ్రౌజర్లు. అయితే, మళ్లీ మళ్లీ పాస్​వర్డ్​ టైప్​ చేయడం తప్పుతుందని కొందరు సేవ్​ పాస్​వర్డ్​ ఆప్షన్​ క్లిక్​ చేస్తారు. అయితే, ఇలా సేవ్​ చేసిన పాస్​వర్డ్స్​ని ‘రెడ్​లైన్​ స్టీలర్​’ అనే మాల్​వేర్ సాయంతో హ్యాకర్లు యూజర్ల ఇన్ఫర్మేషన్​ తెలుసుకుంటారని, ఉద్యోగుల లాగిన్​ పాస్​వర్డ్స్ ద్వారా ఆయా కంపెనీల డేటాని హ్యాక్​ చేస్తారని చెప్తోంది ఒక రిపోర్టు. వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తున్న ఉద్యోగుల కంప్యూటర్, ల్యాప్​టాప్​​లో వర్చువల్​  ప్రైవేట్​ నెట్​వర్క్​ ఇన్​స్టాల్ చేసి ఉంటుంది. ఈ మాల్​వేర్​ విపిఎన్​ సాఫ్ట్​వేర్​ని హ్యాక్​ చేసి డేటా మొత్తాన్ని లాగేస్తుంది. వీళ్ల వెబ్​బ్రౌజర్​లో సేవ్​చేసిన పాస్​వర్డ్స్​ని రెడ్​లైన్​ స్టీలర్​ అనే మాల్​వేర్​ కాజేస్తుంది. ఆ పాస్​వర్డ్స్​సాయంతో  మూడు నెలల తర్వాత వాళ్లు పనిచేస్తున్న కంపెనీ డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుందని అహన్​ ల్యాబ్​ సెక్యురిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ సెంటర్​ (ఎఎస్​ఇసి) ఇచ్చిన రిపోర్ట్​లో చెప్పింది.  పీసీలో యాంటీవైరస్​కి చిక్కకుండా డేటాని క్యాప్చర్​ చేస్తుంది. వీటిని యాంటీవైరస్​లు కూడా గుర్తించలేవు.  డేటా చోరీ నుంచి తప్పించుకోవాలంటే వెబ్​బ్రౌజర్లలో పాస్​వర్డులు సేవ్​ చేయకూడదు. 

 స్టాకర్స్​కి ట్వీట్స్​ కనిపించకుండా..
సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండేవాళ్లు ట్విట్టర్​లో రకరకాల విషయాల మీద ట్వీట్లు, పోస్టులు పెడుతుంటారు. ఆ ట్వీట్లు అందరికీ కనిపించడంతో ఎవరైనా ఇంటరాక్ట్​ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, కొన్నిసార్లు స్టాకర్స్​ నుంచి వేధింపులు వస్తాయి కూడా. అదీకాకుండా కొందరు ఫొటోలను ట్యాగ్​ చేస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా, ట్వీట్లు ఫాలోవర్లకు మాత్రమే కనిపించేలా చేసే ఫీచర్​ తెచ్చింది ట్విట్టర్​. ఆ ఫీచర్​ కోసం సెట్టింగ్స్​లో ప్రైవసీ, సేఫ్టీలోకి వెళ్లాలి. ఆడియెన్స్​ అండ్​ ట్యాగింగ్​ ఆప్షన్​ క్లిక్​ చేస్తే, ‘ప్రొటెక్ట్​ యువర్​ ట్వీట్స్​’ ఆప్షన్​ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పక్కనే కనిపించే చెక్​ బాక్స్​ని ఒకసారి చూసుకోవాలి. అంతేకాదు ఫొటోల్లో ఎవరు ట్యాగ్​ చేయొచ్చో కూడా సెలక్ట్​ చేసుకునే వీలుంది.