తక్కువ ధరకు వస్తున్నాయని..లోకల్ ఛార్జింగ్ కేబుల్స్ వాడుతున్నారా.. బీకేఆర్ ఫుల్

నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్​ చాలా ప్రమాదకరం అని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్​లకు అదే కంపెనీ ఛార్జర్ కేబుల్ వస్తుంది. అయితే అది ఎప్పుడైనా పనిచేయకపోతే కొత్త కేబుల్​ కొనాల్సి వస్తుంది. కానీ, బ్రాండెడ్ కేబుల్ కొనాలంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలామంది చవకైన కేబుల్స్ కొంటుంటారు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో అయితే కొన్ని స్మార్ట్​ఫోన్​లు ఇలాంటి కేబుల్స్​కి స్పందించకుండా సేఫ్​గానే ఉంటున్నాయి. కానీ, పాత స్మార్ట్​ఫోన్లు, ఇతర డివైజ్​లకు మాత్రం వీటి నుంచి ఎలాంటి సేఫ్టీ లేదు. ఈ కేబుల్స్ వాడటం వల్ల డివైజ్​లు పాడయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇవి డివైజ్​లలోని బ్యాటరీ లైఫ్​ని తినేస్తాయి. 

డివైజ్​లలోని బ్యాటరీలు లిమిటేషన్స్, కెపాసిటీని బట్టి పనిచేస్తాయి. కానీ, చవక కేబుల్స్ డివైజ్​కి అవసరమైన దానికన్నా ఎక్కువ లేదా తక్కువ ఎనర్జీ అందిస్తాయి. దీంతో బ్యాటరీ లైఫ్​ పోతుంది. అలాంటప్పుడే కరెంట్​ షాక్​లు కూడా కొడుతుంటాయి. దీనివల్ల వచ్చే షాక్ పెద్దవాళ్లకు ఏం కాకపోయినా, చిన్నపిల్లలకు మాత్రం ప్రాణాంతకం. ఇక కేబుల్స్​కి టేప్​లు వేసి మరీ వాడడం మరీ ప్రమాదకరం. ఇలాంటి కేబుల్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకని ధర ఎక్కువ అయినా నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ క్వాలిటీగా ఉండేవి వాడాలి.