
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): ఎవిన్ లూయిస్ (68), షాయ్ హోప్ (54) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో.. శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లిష్ జట్టు ఆధిక్యాన్ని 3–1కి తగ్గించింది. టాస్ ఓడిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 218/5 స్కోరు చేసింది. జాకబ్ బీతెల్ (62 నాటౌట్), ఫిల్ సాల్ట్ (55), బట్లర్ (38), విల్ జాక్స్ (25), సామ్ కరన్ (24) రాణించారు. గుడకేశ్ మోతీ 2 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో వెస్టిండీస్ 19 ఓవర్లలో 221/5 స్కోరు చేసింది. హోప్, లూయిస్ తొలి వికెట్‌కు 136 రన్స్ జోడించారు. కానీ 10వ ఓవర్‌లో తొలి మూడు బాల్స్‌కు లూయిస్, హోప్, నికోలస్ పూరన్ (0) ఔటయ్యారు. అయితే రొవ్‌మన్ పావెల్ (38), రూథర్‌ఫోర్డ్ (29 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. రెహాన్ అహ్మద్ 3, టర్నర్ ఒక్క వికెట్ తీశారు. హోప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టీ20 ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది.